Begin typing your search above and press return to search.

శవంతో సెక్స్.. ఆమె ఏమంటోందటే..

By:  Tupaki Desk   |   28 July 2017 9:33 AM GMT
శవంతో సెక్స్.. ఆమె ఏమంటోందటే..
X
తెలుగులో కేవలం ప్రేమ సినిమాలు లేదా కామిడీ సినిమాలు మాత్రమే ఎక్కువమంది చూస్తారు అనే వాదన లేదు ఇప్పుడు. తెలుగు ప్రేక్షకులు వైవిధ్యం ఉన్న కథలు రావాలిని బలంగా కోరుకుంటున్నారు. గత కొద్ది కాలంగా మన తెలుగు దర్శకులు కూడా కొత్త కథలను చెప్పడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 2103లో వచ్చిన ఒక చిన్న సినిమా స్వామి రా రా మీకు గుర్తు ఉండే ఉంటుంది. సినిమా కథ పాతదే అయన చెప్పిన సుధీర్ వర్మ తెలివిగానే చెప్పాడు దానితో సినిమాను అందరూ హిట్ చేసేశారు.

పూజ రామచంద్రన్ అనే బెంగళూరు బ్యూటీ ఈ స్వామి రా రా సినిమా తోనే తెలుగు ప్రేక్షకులు దృష్టిలో పడింది. హీరో పక్కనే ఉంటూ హీరోయిన్ లా కాకుండా సైడ్ క్యారక్టర్ చేసి పర్వాలేదు అనిపించింది. స్వామి రా రా సినిమా కన్నా ముందు ఎస్‌ ఎస్ మ్యూజిక్ చానెల్ లో వి‌జే గా కూడా చేసిందీ లేడీ. దానితో తో తమిళ్ సినిమా ఆఫర్లు రావడంతో నటిగా మారింది. తెలుగులో దోచేయ్ - దళం లాంటి సినిమాలు చేసిన పూజకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత తమిళ్ సినిమాలతో బిజీ కావడంతో తెలుగులో సినిమాలు చేయడం తగ్గించేసింది. ఇప్పుడు మళ్ళీ శ్రీ కిశోర్ డైరక్షన్ లో వస్తున్న ‘డి‌ఎస్‌ పి’ అనే సినిమా ద్వారా మళ్ళీ తెలుగు ప్రేక్షకులు ముందుకు హీరోయిన్ గా రాబోతుంది. డి‌ఎస్‌ పి అనే ఈ థ్రిల్లర్ సినిమాలో ఒక చనిపోయిన నటితో ఒక ముగ్గురు సెక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ప్రధాన కథ అని తెలుస్తుంది. అయితే పూజ ఎందుకు ఇటువంటి కథను చేయడానికి సిద్దపడింది అని అందరూ షాక్ తిన్నారు ఆమెకు తెలిసినవాళ్లు అంతా. దానికి పూజ రామచంద్రన్ ఏమి అన్నది అంటే

“నేను సినిమాలు చేద్దాం అనుకున్నప్పటి నుండే నిర్ణయం తీసుకున్న కొత్తగా కనిపించకపోయినా అనిపించకపోయినా నాలాంటి అమ్మాయి తెర పై కనిపించడం అనవసరం అని. ఈ కథలో కొత్తదనం ఉంది పైగా నటించడానికి ఆస్కారం ఉంది. నేను ఇంత వరకు గ్లామర్ పాత్రలు చేయలేదు. ఈ సినిమాలో మొదటిసారి రొమాంటిక్ సీన్లు చేస్తున్నప్పుడు కొంచెం కష్టంగానే అనిపించింది. అందులోనూ క్లోజ్ షాట్ లో నటించాలి అంటే మరి కష్టం. ఇప్పుడు అది నెమ్మది నెమ్మదిగా అలవాటైంది'' అంటోంది. అమ్మడు ఇచ్చిన ఎక్సప్లెనేషన్ మనోళ్ళకు ఎలా నచ్చుతుందో చూద్దాం.