ఎక్కడా కూడా పూజ తగ్గట్లేదుగా

Sat Feb 24 2018 13:16:40 GMT+0530 (IST)

చూడగానే అమాయకంగా కనిపించే హీరోయిన్స్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. గడసరి బామలు కూడా ఓ లెవెల్లో ఉన్నారు. కానీ ఈ రెండు జనర్స్ లో ఉండే కొంత మంది బామలు తీరు ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. క్యూట్ గా నవ్వుతూ ట్రెడిషినల్ లుక్ తో మొన్నటి వరకు కనిపించిన హీరోయిన్స్ సడన్ గా బికినిలో కనిపిస్తారు. గడసరి భామలు అన్ని రకాలుగా ఉంటారనుకోండి.అయితే ఇన్నోసెంట్ గా కనిపించే ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ పూజా హెగ్డే మాత్రం అన్ని తరహా పద్ధతుల్లో కనిపిస్తుంది. అమ్మడు మొదట్లో అంత హాట్ గా ఏమి కనిపించేది కాదు. గ్లామర్ అందాలను ఓ లిమిట్ లో ప్రదర్శించేది. కానీ అవకాశాలు అందాలంటే స్కిన్ షో అవసరమని తెలుసుకున్నట్టు ఉంది. వెంటనే చీర కట్టులోనే హాట్ గా కనిపించడం కాకుండా బికినిలో కూడా కనిపించింది. ఇక ఎక్కడికి వెళ్లినా కూడా హాట్ కాస్ట్యూమ్ తో అందరిని ఆకట్టుకుంటుంది.

ఇటీవల తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లిన పూజా ట్రెడిషినల్ లుక్ లో హాట్ గా కనిపించి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. నాభి అందాలు కనిపించేలా ఉన్న ఆమె కాస్ట్యూమ్ బావుందని అందరు ప్రశంసలను కురిపించారట. పెళ్లిలో అమ్మడి అందాల సందడితో అందరి చూపు తన వైపు తిప్పుకుందని తెలుస్తోంది. ఇలా పూజా ఎక్కడికి వెళ్లినా ఏ మాత్రం తగ్గడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.