Begin typing your search above and press return to search.

ప్రమోషన్లలో గ్లామర్ ధారబోస్తోందే

By:  Tupaki Desk   |   24 Jun 2017 10:57 AM GMT
ప్రమోషన్లలో గ్లామర్ ధారబోస్తోందే
X
అల్లు అర్జున్ మూవీ దువ్వాడ జగన్నాధం ధియేటర్లను దున్నేస్తోంది. జనాల్లో డీజేపై టాక్ అటూ ఇటూగా ఉన్నా.. దాంతో సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురిపించేస్తోంది. రంజాన్ వీకెండ్ కావడంతో.. కనీసం మరో మూడు నాలుగు రోజులు ఈ కలెక్షన్స్ జోరు కంటిన్యూ అయే ఛాన్స్ ఉంది. వీకెండ్ ముగిశాక కూడా డీజేకు క్రేజ్ బాగానే ఉండే అవకాశాలున్నాయి.

అయితే.. సినిమా రిలీజ్ అయ్యి కలెక్షన్స్ జోరు చూపిస్తున్నా.. డీజే టీం మాత్రం ఏ మాత్రం అలసత్వం ప్రదర్శిచండంలేదు. ప్రచారంలో మహా యాక్టివ్ గా పాల్గొంటూ.. డీజే ఎక్కడా స్లో కాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. హీరోయిన్ పూజా హెగ్డే కూడా తన వంతుగా పబ్లిసిటీ యాక్టివిటీస్ లో విరివిగా పాల్గొంటోంది. కెరీర్ లో తొలి హిట్ అందుకునే అవకాశాన్ని మిస్ చేసుకునేందుకు ఈ బ్యూటీ ఏ మాత్రం సిద్ధంగా లేదు. అందుకే సినిమాలో ఎంత గ్లామర్ చూపించిందో.. దాదాపు అదే స్థాయి గ్లామ్ షో ఆఫ్ స్క్రీన్ లో చేసేస్తోంది.

ప్రచారంలో కూడా అందాలు ఆరబోసేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది పూజా హెగ్డే. ఇటు డీజే మూవీలో కూడా పూజా హెగ్డే అందాలు ప్రధాన ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. పాటల్లో కూడా అమ్మడు అందాలు ఆరేయడం.. అదరగొట్టే డ్యాన్సులు వేయడం వంటివి.. పూజా హెగ్డే కెరీర్ కి బాగా ప్లస్ అవుతున్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/