Begin typing your search above and press return to search.

గ్లామర్ పూజ తారాస్థాయికి చేరిందంతే

By:  Tupaki Desk   |   24 Feb 2017 6:23 AM GMT
గ్లామర్ పూజ తారాస్థాయికి చేరిందంతే
X
తమిళంలో వచ్చిన మూగముడి సినిమాతో మిస్సిండియా కంటెస్టెంట్ పూజా హెగ్డే సౌత్ తెరకు పరిచయమైంది. అదే సినిమా తెలుగులోకి రావడం.. ఆ తరువాత నాగచైతన్యతో ఒక లైలా కోసం.. వరుణ్‌ తేజ్ తో ముకుందా వంటి సినిమాలను చేసింది ఈ డస్కీ సైరన్. అయితే మిస్సిండియా పోటీల్లో బికినీ రౌండులో ఓ రేంజులో రెచ్చిపోయింది కాబట్టి.. ఇక్కడ కూడా అలాగే విజృంభిస్తుంది అనుకున్నా కూడా.. అమ్మడు మాత్రం హోమ్లీ రోల్స్ కే పరిమితమైందిలే. కాని ఆ సినిమాలన్నీ ఫ్లాపు కావడంతో.. ఇక్కడ ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు.

ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఎంట్రీ సినిమా ''మొహంజొదారో'' ఫ్లాపు కావడంతో.. అమ్మడు రూటు మార్చేసింది అనే చెప్పాలి. ఆల్రెడీ మొహంజొదారో సినిమాలో తన అందాలను విందు చేసిన పూజ.. ఆ తరువాత పుల మ్యాగజైన్లకు ఇచ్చిన ఫోటో షూట్లలో టూ-పీసు లుక్కులతో రెచ్చిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు మోడ్రన్ గాళ్‌ పాత్రలో ''డిజె దువ్వాడ జగన్నాథమ్'' సినిమాలో కూడా అమ్మడు తన టాలెంట్ చూపించనుందిలే. కేవలం టీజర్లో అమ్మడు తన నడుం సోయగాలను.. టూ పీస్ లుక్కును ఆవిష్కరించిందంటే.. ఇక మొత్తం సినిమాలో.. అలాగే సీన్స్ లో చితక్కొట్టేసే ఛాన్సుంది. గ్లామర్ పూజను తారాస్థాయికి తీసుకెళ్లిందని చెప్పుకోవచ్చు.

ఆల్రెడీ పూజా హెగ్డే కోసం మెగా క్యాంపు నుండే ఓ రెండు సినిమాలు లైన్లో ఉన్నాయని బయట టాక్ వినిపిస్తోంది. డిజె సినిమా సక్సెస్ పై ఆమె బ్రేక్ ఆధారపడి ఉంటుంది. గతంలో శృతి హాసన్ దశను హరీశ్ శంకర్ తిప్పేశాడు కాబట్టి.. పూజ కూడా అలాంటి ఫేటే అంచనా వేసుకోవచ్చులే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/