సుందరి సున్నితం.. కసరత్తులు కఠినం!

Sat Dec 15 2018 14:23:47 GMT+0530 (IST)

టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ లీగ్ హీరోయిన్ ఎవరంటే.. తడుముకోకుండా వెంటనే పూజా హెగ్డే పేరు చెప్పుకోవాలి.  ఎందుకంటే మహేష్ బాబు ల్యాండ్ మార్క్ ఫిలిం 'మహర్షి' లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభాస్ - రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా పూజానే హీరోయిన్.  ఈ రెండు సినిమాలు కాకుండా హిందీలో అక్షయ్ కుమార్ సినిమా 'హౌస్ ఫుల్ 4' లో కూడా హీరోయిన్.మరి ఈ రేంజ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించాలంటే నటన కంటే గ్లామర్ చాలా ముఖ్యం. అందుకే జిమ్మును అసలు వదిలిపెట్టకుండా క్రమం తప్పకుండా రోజు కసరత్తులు చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా ఒక ఎక్సర్ సైజ్ విడియో షేర్ చేసింది. ఫిట్నెస్ కోసం చేసే పైలేట్ యాబ్ వర్క్ అవుట్ చాలా పాపులర్..  ఈ కసరత్తులను అవలీలగా చేస్తున్న పూజ తనకు ఫిట్నెస్ పై ఎంత ఫోకస్ ఉందో చెప్పకనే చెప్పేసింది.  దీనికి క్యాప్షన్ ఇలా ఇచ్చింది.."బలాన్ని పెంచుకునేందుకు నా రోజు ఇలా స్టార్ట్ చేశాను.  కొన్నిసార్లు  నెమ్మదిగా చేసినా.. కఠినమైన పైలేట్స్ ఎక్సర్ సైజులు అవసరమే."

సున్నితంగా కనిపించే ఈ సుందరి ఇలా కఠినమైన కసరత్తులు చేస్తూ ఉంటె బ్యాక్ గ్రౌండ్ లో కొలంబియన్ సింగర్స్ షకీరా - మాలుమా పాడిన స్పానిష్ సాంగ్ 'జంతాగె' ప్లే అవుతూ ఉంది.  వాళ్ళు "తూ ఎరెస్.. పూరో పూరో జంతాగె" అంటూ పాడుతూ ఉంటే పూజ రెచ్చిపోయి ఎక్సర్ సైజులు చేస్తూ ఉంది.  సూపర్ కదా?

వీడియో కోసం క్లిక్ చేయండి