సంవత్సరం తరువాత గాల్లో వేలాడుతూ

Thu Jan 18 2018 16:55:20 GMT+0530 (IST)

ఒక లైలా కోసం టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అమ్మడికి 2017 కొంచెం బాగానే కలిసొచ్చింది. బన్నీతో చేసిన దువ్వడా జగన్నాథమ్ సినిమా మిక్స్ డ్  టాక్ తెచ్చుకున్నా కూడా హరీష్ శంకర్ అమ్మడిని చూపించిన విధానం అందరికి తెగ నచ్చేసింది. ఈ బ్యూటీఫుల్ గర్ల్ లో తెలియని అందం ఎదో ఉందని దర్శకనిర్మాతలు ఆకర్షితులై గ్లామర్ రోల్స్ కి సెలెక్ట్ చేసుకుంటున్నారు.పూజ మొదట్లో కొంచెం ట్రెడిషనల్ లుక్ తోనే ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా ముకుంద సినిమాలో ఈమెను ఎవరైనా చూస్తే డీజే లో కనిపించిన బికినీ బ్యూటీనేనా అని అంటారు. ఇక అసలు విషయానికి వస్తే.. పూజ ప్రస్తుతం తన సహజ సిద్ధమైన సొగసులకు కొంచెం బూస్ట్ ఇస్తోంది. మొన్నటి వరకు షూటింగ్ తో బిజీగా ఉన్న పూజ కాస్త ఖాళీ సమయం దొరకగానే తనకు ఇష్టమైన ఏరియల్ సిల్క్స్ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది. దాదాపు ఏడాది వరకు ఈ వ్యాయామానికి దూరమైన పూజ ఫైనల్ గా జిమ్ సెంటర్లో చాలాసేపు గడిపింది. గాల్లో వేలాడుతూ.. అలా ఎక్సర్ సైజ్ చేసి ఫిట్నెస్ పెంచుకుంటోందట.

ఇక దువ్వడా జగన్నాథమ్ సినిమా తరువాత ఈ ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ ఇంతవరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే 2018లో మాత్రం మూడు సినిమాల్లో కనిపించబోతోంది. సాక్ష్యం.. రేస్ సినిమాలతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.