తారక్ ఫ్యాన్స్ కి ముసళ్ల పండగ

Mon Sep 24 2018 10:17:27 GMT+0530 (IST)

ముకుంద - ఒక లైలా కోసం చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ముంబై బ్యూటీ పూజా హెగ్డే. ఆ రెండు సినిమాలతో రాని క్రేజు ఉన్నట్టుండి `డీజే` సినిమాతో వచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించినందుకు ఆ క్రెడిట్ దక్కిందనుకుంటే పొరపాటే. డీజే- దువ్వాడ జగన్నాథమ్ లో ఆ 3 నిమిషాల బికినీ సీన్ తో వచ్చిన క్రేజు అదంతా. పాపం అమాయక జగన్నాథమ్ పిల్లను చూడటానికి మనసు విప్పి మాట్లాడటానికి విచ్చేస్తాడు. అది కూడా స్విమ్మింగ్ పూల్ లో స్నానమాచరించే సన్నివేశంలో. అక్కడ పూజా ఇచ్చే ఎంట్రీ మామూలుగా ఉంటుందా. 3 నిమిషాల ఆ సన్నివేశంలో గజగజ ఒణకాల్సిందే. పూజా బికినీ ట్రీట్ కి థియేటర్ లో యువజనం అస్సలు కళ్లు తిప్పుకోలేదంటే నమ్మండి. అంతగా సీటు అంచుకు జారి పోయి మరీ చూశారా సీన్. ఇప్పటికీ యూట్యూబ్ లో ఈ సీన్ కి బోలెడంత గిరాకీ ఉంది.అందుకే ఇప్పుడు సేమ్ సీన్ ని త్రివిక్రముడు రిపీట్ చేస్తున్నారు అంటే తారక్ ఫ్యాన్స్ లో ఒకటే ఉత్కంఠ మొదలైంది. ఇంతకీ `అరవింద సమేత`లో ఈ సీన్ ఎన్ని నిమిషాలు అంటూ నీళ్లు నమిలేస్తున్నారు ఫ్యాన్స్. ఈసారి కాస్తంత సుదీర్ఘంగానే పూజా బికినీ ట్రీట్ ఉండబోతోందనేది ఓ హింటు. 5 నిమిషాల సీన్ లో పూజా బికినీ అందాలు మతి చెడేలా ప్లాన్ చేశారట మాయావి త్రివిక్రమ్. అసలే అందాల ఆరబోతకు అడ్డు చెప్పని ముంబై బ్యూటీ.. మరోసారి అడ్డూ ఆపూ లేకుండా చెలరేగనుందని తెలుస్తోంది. ఆ మాత్రం మసాలా దట్టించనిదే ఎన్టీఆర్ మాస్ ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడం అంత సులువా?  పాపం అందుకే త్రివిక్రముడు రాజీకొచ్చి చేస్తున్నాడట ఈ సీన్.

అయినా ఈ చిత్రంలో మడి - ఆచారం అంటూ కట్టుబాట్లతో పనేలేని - కత్తి దూసి శత్రువు తలనరికే ఎన్టీఆర్ ని చూడబోతున్నారు కాబట్టి - అందుకు తగ్గట్టే కాస్తంత ఘాటుగా - నాటీగానే ఆ సన్నివేశం ఉంటుందనే అంచనా వేస్తున్నారు. అందుకే తారక్ ఫ్యాన్స్ కి ముందుంది ముసళ్ల పండగ. ఈ దసరాకి ఆ ఒక్క సీనుతో ఏడాదంతా పండుగే. అయినా సన్నివేశం డిమాండ్ చేశాక ఎవరైతే మాత్రం ఏం చేస్తారులే?  ఇక తొలిసారి ఈ సినిమా కోసం పూజా డబ్బింగ్ చెబుతోందిట. స్వతహాగా కన్నడిగ అయిన పూజా చేత ఈ ఎటెంప్ట్ చేయించినా సరిగా సెట్ కాలేదని చెబుతున్నారు. దీంతో పూజా డబ్బింగ్ ని త్రివిక్రమ్ పక్కనపెడతాడా.. లేక ప్రయోగం చేస్తాడా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 11న అరవింద సమేత రిలీజ్ కానుంది.