సింగర్ కాబోతున్న డిజే సుందరి

Wed Jun 12 2019 16:52:49 GMT+0530 (IST)

హాట్ బికినీ అందాలతో అల్లు అర్జున్ డిజేలో ప్రేక్షకులను తన మాయలో పడేసిన పూజా హెగ్డే ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో దూసుకుపోతోంది. ఇప్పుడు స్టార్ హీరో ఎవరైనా సరే ఫస్ట్ ఆప్షన్ గా తన పేరే చెబుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అరవింద సమేత వీర రాఘవ కోసం స్వంతంగా డబ్బింగ్ చెప్పుకున్న ఈ బ్యూటీ త్వరలో సింగర్ అవతారం ఎత్తబోతోంది. ఇది కూడా త్రివిక్రమ్ సినిమా కోసమే కావడం గమనార్హం.అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న మూవీలో పూజానే హీరొయినన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ లో స్టార్ట్ అయిన రెండో షెడ్యూల్ లో తను పాల్గొంటోంది. ఎప్పటినుంచో పాటలు పాడాలన్న పూజా కోరికను ఓ ఇంటర్వ్యూలో గమనించిన తమన్ ఎట్టకేలకు తన కోరికను తీర్చబోతున్నాడు. చాలా వెరైటీగా హస్కీగా అనిపించే పూజా వాయిస్ లో ఓ గమ్మత్తు ఉంటుంది. అరవింద సమేతలో గమనించవచ్చు. అలాంటిది పూజ పాడితే క్లిక్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.

ఈ కారణంగానే స్పెషల్ ట్యూన్ ఒకటి కంపోజ్ చేసిన తమన్ త్వరలోనే రికార్డు చేయబోతున్నట్టు తెలిసింది. ఇది డ్యూయెట్ గా వస్తుందా లేక హీరొయిన్ సోలో సాంగా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి పూజా మరో బంపర్ ఆఫర్ అయితే కొట్టేసింది. తన ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దీంతో పాటు ప్రభాస్ సినిమా చేస్తున్న పూజా హిందిలో చేసిన హౌస్ ఫుల్ 4 త్వరలో విడుదల కానుంది. నార్త్ సౌత్ రెండు చోట్లా బిజీగా ఉన్న పూజా హెగ్డే స్పీడ్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు