పూజా చిందుల వెనక సీక్రెట్టెంటో?

Mon Mar 19 2018 09:19:32 GMT+0530 (IST)

రంగస్థలం సినిమాలో హీరోయిన్ రామలక్ష్మి.. అదే అక్కినేనివారి కోడలు సమంత. అందులో సందేహమే లేదు. ఈ సినిమాలో ఇంకో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఉంది.. సుకుమార్ సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన ఐటం సాంగులో జిగేల్ రాణిలా కనిపించి తన స్టెప్పులతో వెండితెరను జిగేల్ మని మెరిపించనుంది.సాధారణంగా ఇప్పటిదాకా ఐటం సాంగుల్లో నటించిన హీరోయిన్లంతా వీలయినంత సొమ్మలు రాబట్టుకుని ఆ నాలుగు స్టెప్పులు వేసేసి బైబై చెప్పేసి వెళ్లిపోయారు. కానీ పూజా హెగ్డే మాత్రం విషయంలో కాస్త డిఫరెంటనే చెప్పాలి. ప్రస్తుతం హీరోయిన్ గా టాప్ ట్రెండింగ్ లో ఉన్న పూజా హెగ్డే రంగస్థలంలో ఐటం సాంగ్ చేయడమే ఈ సినిమాకు ఓ అట్రాక్షన్. అలాంటిది ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చింది. అంతే కాదు స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేసి మరీ అభిమానులను ఖుషీ చేసింది. ఐటం సాంగ్ చేసిన హీరోయిన్.. అలా సినిమా ప్రమోషన్ ఈవెంట్ కు కు వచ్చి నాలుగు స్టెప్పులు వేయడం ఇదే మొదటిసారేమో.

అంతవరకు ఏదో అలా గడిచిపోతోంది అనేలా సాగిన పూజా కెరీర్ కు యు టర్న్ ఇచ్చిన మూవీ దువ్వాడ జగన్నాథమ్. ఈ సినిమాతో పూజా మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ అయిపోయింది. అలాంటిది ఐటం సాంగులో చేసినందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డ్యాన్స్ చేసిందంటే... తనకు ఇంత బూస్ట్ ఇచ్చిన మెగా ఫ్యామిలీకి కృతజ్ఞతా లేక.. మెగా ఫ్యామిలీలో తరవాత రాబోయే సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకోవాలన్న వ్యూహమా?