Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: అరేబియా తీరాన అందాల పూజ

By:  Tupaki Desk   |   16 Aug 2018 9:00 AM GMT
ఫోటో స్టొరీ: అరేబియా తీరాన అందాల పూజ
X

న్యూ జనరేషన్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఇప్పుడు మంచి జోరు మీద ఉంది. ఒకవైపు యంగ్ టైగర్ సినిమా 'అరవింద సమేత వీర రాఘవ' మరో వైపు మహేష్ బాబు 'మహర్షి' సినిమాలతో టాప్ లీగ్ హీరోలన్ల లిస్టులో ఉంది. ఇవే కాకుండా బాలీవుడ్ ఆఫర్లు కూడా చేతిలో ఉన్నాయి. ఇంకేముంది ముంబై - హైదరాబాద్ - ముంబై అని చక్కర్లు కొడుతూ ఉంది. ఈ మధ్యలో గ్యాప్ దొరికితే విమానమెక్కి గోవా లో వాలిపోయింది.

అసలే ఋతుపవనాల కాలం.. చల్లని జల్లులు.. పచ్చని ప్రకృతి.. వెనక అరబియా సముద్రం అందాలు.. లోకేషనేమో అమీర్ ఖాన్ 'దిల్ చాహతా హై' షూట్ చేసిన చపోరా ఫోర్ట్. ఇక మనసు ఆగుతుందా? ఒక చిట్టి పొట్టి స్కర్ట్ లో మంచి పోజిచ్చి అరేబియా అందాలు తన అందాలు ఒకే ఫోటోలో వచ్చేలా చేసింది. ఆ ఎపిక్ ఫోటో ను ఇన్స్టా గ్రామ్ లో ఎత్తినింపింది.. సారీ 'అప్-లోడ్' చేసింది.

పోస్ట్ చేసి జస్ట్ నాలుగు గంటలే అయినా ఇప్పటికే లక్షా ఇరవై ఆరు వేలకు పైగా లైకులు వచ్చాయి. అసలే అరవింద.. ఆ మాత్రం లైకులు రాకపోతే ఎలా. ఇదంతా సరే గానీ ఈ నెటిజెనులు ఊరికే ఉబుసుపోక అదేపనిగా లైకులు కొట్టడమేనా లేక ఎప్పుడైనా గోవాకు వెళ్లి అక్కడ ఈ పూజా హెగ్డే స్టైల్ లో ఎంజాయ్ కూడా చేస్తారా?