Begin typing your search above and press return to search.

ప్రభాస్ కోసం మరీ ఇన్ని బిస్కెట్లా?

By:  Tupaki Desk   |   23 April 2019 4:33 AM GMT
ప్రభాస్ కోసం మరీ ఇన్ని బిస్కెట్లా?
X
టాలీవుడ్ కెరీర్ ని ఫ్లాప్ తోనే మొదలుపెట్టినా రెండేళ్ళ నిరీక్షణ తర్వాత టాప్ రేంజ్ వైపు దూసుకుపోతున్న పూజా హెగ్డే స్పీడ్ మాములుగా లేదు. అగ్ర హీరోలకు తను తప్ప వేరే ఛాయస్ కనిపించడం లేదు.డిమాండూ అదే స్థాయిలో ఉంది. ఒకపక్క బాలీవుడ్ ఆఫర్లు మరోపక్క తెలుగు సినిమాల అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం పూజా ప్రభాస్ తో రాధాకృష్ణ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది విడుదల కానుంది.

ఈ సందర్భంగా ప్రభాస్ తో తన యాక్టింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి షేర్ చేసుకున్న పూజా ఇప్పటిదాకా తాను చేసిన హీరోలు అందరిలోకి అణిగిమణిగి ఉంటూ తానో పెద్ద స్టార్ అనే ఫీలింగ్ లేకుండా పరస్పర గౌరవం ఇచ్చి పుచ్చుకునే వాళ్ళలో ప్రభాస్ టాప్ అని చెప్పేసింది. ఇది మిగిలిన హీరోల ఫ్యాన్స్ ను ఎంతో కొంత హర్ట్ చేసేదే. అతి సౌమ్యుడిగా పేరున్న మహేష్ బాబుతో పూజా మహర్షి చేసింది. అతి త్వరలో మే 9న అది విడుదల కానుంది. మరి మహేష్ లో ఆ లక్షణాలు కనిపించలేదా అనేది వాళ్ళ ప్రశ్న.

ఇంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవతో సక్సెస్ కొట్టింది. బ్రేక్ ఇచ్చిన డిజే హీరో అల్లు అర్జున్ గురించి మాట లేదు. సాక్ష్యంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా జోడి కట్టాడు. వీళ్ళందరి కన్నా ప్రభాస్ అంత స్పెషల్ అని చెప్పడంలో మర్మమేమిటో మరి. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసిన పూజా హిందీ హౌస్ ఫుల్ 4 మీద కూడా చాలా ఆశలు పెట్టుకుంది. ప్రభాస్ గురించి ఇంత స్పెషల్ చెప్పడం వెనుక అర్థం బిస్కెట్స్ అనుకోవాలా లేక ఇంకో ఆఫర్ కోసం గేలం అనుకోవాలా