పోస్టర్ ఓల్డ్ కానీ సెక్సీనెస్ ఎవర్ గ్రీన్..!

Sun Jun 23 2019 18:00:33 GMT+0530 (IST)

హరీష్ శంకర్ - స్టైలిష్ సార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'డీజె - దువ్వాడ జగన్నాథమ్'.  ఈ సినిమా రిలీజ్ అయి రెండేళ్ళయిన సందర్బంగా సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ 2 ఇయర్స్ ఆఫ్ డీజె అంటూ సందడి చేస్తున్నారు.  హరీష్ శంకర్ కూడా ఈ సందర్భంగా తన ట్విట్టర్ ద్వారా అల్లు అర్జున్.. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్.. సినిమాటోగ్రాఫర్ బోస్ లకు కృతజ్ఞతలు తెలిపాడు.  ఈ ముగ్గురితో పాటుగా బ్యూటిఫుల్ పూజా హెగ్డేను ప్రత్యేకంగా గుర్తు చేసుకొని "నీ ప్రెజెన్స్ తో డీజె ను టాక్ ఆఫ్ ది టౌన్ గా చేసినందుకు కృతజ్ఞతలు" అని ట్వీట్ చేస్తూ ఒక పోస్టర్ ను.. పూజాతో ఉన్న మరో ఫోటోను పోస్ట్ చేశాడు.  ఈ పోస్టర్ లో 'ఆడియో   సూన్' అని ఉంది.  ఇక ఈ ఫోటోలో పూజా హెగ్డే అందాలు మతిపోయేలా ఉన్నాయి.  డార్క్ కలర్ టాప్.. ప్యాంట్.. గ్రే కలర్ జాకెట్ ధరించిన పూజ రెండు  చేతులను పైకెత్తి ఒక కిరాక్ పోజిచ్చింది. అయితే హైలైట్ మాత్రం పూజ నాభి అందాలే.  'డీజె' కలెక్షన్స్ విషయంలో నానా హంగామా జరిగింది.. కానీ అందరూ ముక్తకంఠంతో ఒప్పుకున్న విషయం మాత్రం పూజ తన బికినీ అందాలతో జనాలను క్లీన్ బౌల్డ్ చేసిందన్నదే. 'డీజె' ఎఫెక్ట్ తోనే పూజకు నెక్స్ట్ క్రేజీ ఆఫర్లు వచ్చాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం హరీష్ శంకర్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో 'వాల్మీకి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.  తమిళ సూపర్ హిట్ 'జిగార్తాండ' కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ నమ్మకం పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాను హిట్ చేసి తన సత్తాను మరోసారి చాటుకుంటాడేమో వేచి చూడాలి.