Begin typing your search above and press return to search.

ఆ కటింగ్ బాలేదు డీజే బ్యూటీ

By:  Tupaki Desk   |   29 Nov 2017 7:36 AM GMT
ఆ కటింగ్ బాలేదు డీజే బ్యూటీ
X
టాలీవుడ్ గ్లామర్ వరల్డ్ లో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయింది పూజా హెగ్డే. డీజే-దువ్వాడ జగన్నాధం మూవీ రిలీజ్ తర్వాత లాభపడినది ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క పూజా మాత్రమే. అమ్మడు మోగించిన అందాల మోతకు ఆ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అదే క్రేజ్ ని ఉపయోగించుకున భారీ రెమ్యూనరేషన్ తో ఆఫర్స్ ను కూడా పట్టేసింది. టాప్ రేంజ్ స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈమెను పరిశీలించే స్థాయికి చేరుకుంది.

తాజాగా పూజా హెగ్డే గోవాలో జరుగుతున్న 48వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో సందడి చేసింది. మరి ఇలాంటి అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ కు అందాలు ఒలకబోస్తూ హాజరు కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. పక్కా ఇండియన్ కల్చర్ కు తగినట్లుగా డ్రెసింగ్ చేసినట్లుగా అనిపిస్తున్నా.. కనిపిస్తున్నా.. అందులోనూ ఫ్యాషన్ ను భలేగా మిక్స్ చేసింది. ఆర్నమెంట్స్ కూడా బెస్ట్ మ్యాచింగ్ ను అలంకరించడంతో స్టైలింగ్ మాత్రం సూపర్బ్ గా ఉంది.

అంతా బాగానే ఉంది కానీ.. ఆ హెయిర్ స్టైల్ విషయంలో మాత్రం ఎందుకో నిర్లక్ష్యం చేసేసింది పూజా హెగ్డే. మరీ నడి నెత్తిని అంటుకుపోయిన హెయిర్ ను చూస్తే.. ఆ డ్రెసింగ్ కి హెయిర్ స్టైల్ కి కొంచెం కూడా మ్యాచ్ కాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అన్ని యాంగిల్స్ ను అద్భుతంగా కవర్ చేసిన ఈ గ్లామర్ భామ.. ఆ విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేసిందో!