Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: సెక్సీనెస్ టన్నుల్లో ఉంది!

By:  Tupaki Desk   |   19 Nov 2018 8:03 AM GMT
ఫోటో స్టొరీ: సెక్సీనెస్ టన్నుల్లో ఉంది!
X
హీరోయిన్లకు ఫ్లాపులు తగిలితే నెక్స్ట్ సినిమాల్లో అవకాశాలు రావడం కష్టం.. ఇక స్టార్ హీరోల క్రేజీ ప్రాజెక్టులలో ఆఫర్ దొరకడం మరింత కష్టం. కానీ ఈ విషయంలో పూజా హెగ్డే మొదటి నుంచి లక్కీనే. చెప్పుకోదగ్గ హిట్లు లేవు.. పైగా డిజాస్టర్లు తన ఖాతాలో ఉన్నాయి.. అయినా స్టార్ హీరోల సినిమాల్లో తనకు హీరోయిన్ అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా 'డీజె' సినిమాలో గ్లామర్ షో తర్వాత పూజ క్రేజీ బ్యూటీగా మారిపోయింది.

ఇప్పుడు మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా జీక్యూ మ్యాగజైన్ కోసం ఈమధ్య ఓ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోషూట్ కోసం రెడీ అవుతూ ఒక సెల్ఫీ తీసుకుని ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. దానికి 'జీక్యూ మ్యాగజైన్ కోసం షూట్ చేసేందుకు.. దువ్వకుండా నిద్రలేచినప్పుడు ఉండే స్టైల్ లో జుట్టు ఉండడం కంటే బెటర్ ఏముంటుంది"అనే క్యాప్షన్ ఇచ్చింది.

జుట్టు సగం మొహాన్ని కవర్ చేస్తూ ఉండగా టాప్ ఏదీ వేసుకోకుండా ఒక లేసుల ఇన్నర్ లో కనిపించింది. సెక్సీ.. హాటీ.. ఇలాంటి పదాలు ఎన్ని ఉన్నాయి అన్నీ వాడాలి ఆమె ఎలా ఉందో వివరించాలి. సరైనోడు భాషలో చెప్పాంటే సెక్సీనెస్ టన్నుల్లో ఉంది!