Begin typing your search above and press return to search.

రానా వ‌ల్ల ద‌క్కిన ఛాన్స్ ఇది!

By:  Tupaki Desk   |   21 May 2019 5:30 PM GMT
రానా వ‌ల్ల ద‌క్కిన ఛాన్స్ ఇది!
X
`మ‌హ‌ర్షి` స‌క్సెస్ మీట్ లో రెడ్ హాట్ లుక్ లో త‌ళుకుబెళుకులతో రెచ్చ‌గొట్టింది పూజా హెగ్డే. టాలీవుడ్ లో మోస్ట్ ల‌క్కీయెస్ట్ హాటీగా పూజా పేరు మార్మోగిపోతోంది. కెరీర్ ఆరంభంలోనే అల్లు అర్జున్.. ఎన్టీఆర్.. మ‌హేష్ లాంటి స్టార్ల స‌ర‌స‌న న‌టించేసింది. ఆ మూడు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ప్ర‌స్తుతం టాలీవుడ్ మోస్ట్ చాలెంజింగ్ హీరో ప్ర‌భాస్ స‌ర‌స‌న `జాన్` చిత్రంలో న‌టిస్తోంది. సాహో లాంటి క్రేజీ సినిమా త‌ర్వాత ఈ చిత్రం రిలీజ్ కానుంది. 2020 సంక్రాంతి బ‌రిలో జాన్ రిలీజ‌వుతుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

మ‌రోవైపు పూజా ప్ర‌స్తుతం బాలీవుడ్ లో `హౌస్ ఫుల్ 4` ఫ్రాంఛైజీలో న‌టిస్తూ వేడి పెంచుతోంది. అక్క‌డా ప‌లు భారీ ప్రాజెక్టుల‌కు సంత‌కాలు చేసి బిజీ అయిపోతోంది. ఇక‌పోతే పూజా హెగ్డేకి హౌస్ ఫుల్ ఫ్రాంఛైజీలో అవ‌కాశం రావ‌డానికి కార‌కుడెవ‌రు? అంటే యంగ్ హీరో రానా అని ముంబైలో ప్ర‌చారం సాగుతోంది. పూజాకి రానా రిక‌మండేష‌న్ తోనే `హౌస్ ఫుల్ 4` ఛాన్స్ వ‌చ్చింద‌ని మీడియాలో ప్ర‌చార‌మ‌వుతోంది. అంతేకాదు .. ఈ అద్భుత అవ‌కాశాన్ని పూజా స‌ద్వినియోగం చేసుకుంటుందా? అంటూ విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఈ సినిమాలో ఉన్న న‌లుగురు భామ‌ల్లో పూజానే హాట్.. ట్రెండింగ్ బ్యూటీ కాబ‌ట్టి క్రెడిట్ అంతా త‌న‌కే ద‌క్కుతుందా? అంటూ వాడి వేడిగా ముచ్చ‌ట సాగుతోంది.

కిలాడీ అక్ష‌య్ కుమార్- రితేష్ దేశ్ ముఖ్- బాబి డియోల్- కృతి స‌నోన్- కృతి క‌ర్భంద తదిత‌ర భారీ తారాగ‌ణం ఈ చిత్రంలో న‌టిస్తోంది. వీళ్లంతా తాజాగా పుర్రెల‌తో క‌లిసి గ్రూప్ ఫోటో దిగి సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. హౌస్ ఫుల్ కాన్సెప్ట్ .. క్రైమ్ థ్రిల్ల‌ర్.. ఫ‌న్ జోన‌ర్ క‌థాంశాన్ని ఎలివేట్ చేసే థీమ్ తో ఈ పోస్ట‌ర్ లో ఆవిష్క‌రించారు. ప్ర‌స్తుతం ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ జ‌రుగుతోంది. సాజిద్ ఖాన్ - ఫ‌ర్హాద్ సామ్జీ సంయుక్తంగా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మీటూ సెగ‌తో సాజిద్ ఖాన్ త‌ప్పుకున్నాక ఫ‌ర్హాద్ కెప్టెన్సీని చేప‌ట్టారు. ఇక‌పోతే రానా రిక‌మండ్ చేసిన పూజాకి ఈ సినిమాలో అద్భుత‌మైన క్యారెక్ట‌ర్ ద‌క్కింద‌ని అర్థ‌మ‌వుతోంది. పూజా బోల్డ్ లుక్ .. పెర్ఫామెన్స్ ఈ మూవీకి ప్ల‌స్ కానున్నాయ‌ని అంత‌ర్జాలంలోకి వ‌చ్చిన‌ తాజా ఫోటోలు చెబుతున్నాయి.