Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మోనాలిసాకు జెరాక్సువా?

By:  Tupaki Desk   |   3 Dec 2018 7:51 AM GMT
ఫోటో స్టోరి: మోనాలిసాకు జెరాక్సువా?
X
అంద‌గ‌త్తెల్ని మోనాలిసాతో పోలుస్తుంటారు క‌వులు. ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న మోనాలిసాను చూశారా? అచ్చం ఆమెలానే కురులు విర‌బోసి ఎంత సింపుల్‌ గా క‌నిపిస్తోందో? ఈ రూపం చూడ‌గానే అవును నిజ‌మే.. మోనాలిసాను ఇమ్మిటేట్ చేస్తోందా ఈ అమ్మ‌డు? ఇంత‌లోనే అంత‌గా ఊహించుకుంటోందా? అంటూ ఒక‌టే సెటైర్లు వేస్తున్నారు క్రిటిక్స్.

అందాల క‌థానాయిక పూజా హెగ్డే కెరీర్ ప‌రంగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న మాట నిజ‌మే. ఎన్టీఆర్ స‌ర‌స‌న అర‌వింద‌స‌మేత వీర‌రాఘ‌వ చిత్రంలో న‌టించింది. అర‌వింద అన్న టైటిల్ పేరుతో మెప్పించింది. ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి చిత్రంలో న‌టిస్తూనే ప్ర‌భాస్ స‌ర‌స‌న జాన్ అనే చిత్రంలో న‌వ‌లానాయిక‌గా - ప్రేమికురాలిగా న‌టిస్తోంది. మొత్తానికి పూజా గ్రాఫ్ పెరుగుతున్న మాట నిజ‌మే కానీ - మ‌రీ మోనాలిసా అని పిలుపించుకునేంత‌గా ఈవిడ‌లో ఏం ఉంది? అని ప్ర‌శ్నిస్తున్నారు కొంద‌రైతే.

అదంతా స‌రే.. ఇటీవ‌లే రణ్వీర్ సింగ్ అండ్ దీపికా పడుకొనే వెడ్డింగ్ రిసెప్షన్ లో పూజా హెగ్డే త‌ళుక్కుమ‌న్న తీరు మ‌రోమారు వాడి వేడిగా చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. ఈ భామ కురులు ఆర‌బోసిన ఫోజు.. వీపందం ఆవిష్క‌రించిన ఫోజులు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వేడెక్కిస్తున్నాయి. డిజైన‌ర్ లేసుల‌ టాప్.. ప‌రికిణీ లుక్ ఆక‌ర్షించింది. బ్యూటిఫుల్.. జార్జియ‌స్‌,.. సెక్సీ కిల్ల‌ర్.. క‌త్తిలాంటి.. నైస్.. ఐ ల‌వ్ యు!! అంటూ కుర్రాళ్లు హీటెక్కిపోతున్నారు.