తెల్ల గులాబీ అట.. పూజ చేస్తారా..

Tue Dec 12 2017 23:00:01 GMT+0530 (IST)


టాలీవుడ్ సోయగం పూజా హెగ్డే కు తెలుగునాట మంచి డిమాండే ఉంది. ఈమె నటించిన సినిమాలు భారీ సక్సెస్ కొట్టకపోయినా.. అమ్మడికి మంచి క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా గ్లామర్ ఎగ్జిబిషన్ విషయంలో ఏ మాత్రం అభ్యంతరాలు పెట్టుకోకపోవడం ఈ అందాల భామకు కలిసొచ్చే విషయం.అటు నార్త్ లో కూడా వెలిగిపోదామనే ఆశలు పూజాకు చాలానే ఉన్నాయి కానీ.. కాలం ఇంకా కలిసిరాలేదు. రీసెంట్ గా ఈ సుందరి లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ ఈవెంట్ లో పాల్గొంది. వైట్ కలర్ డ్రెస్సులో తెగ మెరిసిపోయింది పూజా హెగ్డే. వస్త్రాల మెరుపులతో పాటు తన మేని సొగసులను కూడా బాగానే ప్రదర్శించింది. ఈ కోల ముఖం సుందరికి.. తన ఈ గెటప్ తెగ నచ్చేసినట్లుగా ఉంది. అందుకే సోషల్ మీడియాలో ఈ ఫోటోను పోస్ట్ చేసేసి.. తనకు తానే కితాబులు కూడా ఇచ్చేసుకుంటోంది. లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డుల కోసం ఈ డ్రెసింగ్ చేసుకున్న తాను.. ఓ గులాబీ మాదిరిగా ఉన్నానని అంటోంది.

వైట్ డ్రెస్సులో ఉంది కాబట్టి.. తెల్ల గులాబీ అని తనకు తానే తెగ ఫీలయిపోతోందన్న మాట. ట్యాగ్ లు ఎలాంటివి పెట్టుకున్నా.. ఎక్స్ పోజింగ్ లో ఏ మాత్రం తగ్గకపోవడం.. గ్లామర్ లవర్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా చేసేందుకు భారీ మొత్తమే రెమ్యూనరేషన్ పుచ్చుకుని ప్రిపేర్ అయిపోతోంది పూజా హెగ్డే.