Begin typing your search above and press return to search.

బ్రాహ్మిన్ భామగా డిజె గాళ్‌

By:  Tupaki Desk   |   23 Feb 2018 6:55 AM GMT
బ్రాహ్మిన్ భామగా డిజె గాళ్‌
X
డీజే - దువ్వాడ జగన్నాధం మూవీలో హీరో అల్లు అర్జున్ లవర్ పాత్రలోనే కనిపించింది పూజా హెగ్డే. కానీ ఈ చిత్రంలో ఆమెది ఫుల్ ప్లెడ్జెడ్ గ్లామర్ రోల్. డీజేలో ఆరబోసిన అందాలు ఈమెకు ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. అలాగని వాటికే స్టిక్ అయిపోకుండా.. ఛాలెంజింగ్ పాత్రలకు సై అంటోంది ఈ బ్యూటీ.

అప్పుడు బ్రాహ్మణ అబ్బాయితో ఆన్ స్క్రీన్ ప్రేమాయణం ఆడిన అనుభవంతో.. ఇప్పుడు పూర్తి స్థాయిలో తనే బ్రాహ్మల అమ్మాయి పాత్రలో నటించేస్తోంది. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న సాక్ష్యం చిత్రాన్ని పూర్తి చేసేస్తోంది పూజా హెగ్డే. ఈ చిత్రంలోనే ఆమె బ్రాహ్మిన్ భామగా కనిపించనుంది. ఈ రోల్ ను ఆమెను దృష్టిలో పెట్టుకునే డైరెక్టర్ డిజైన్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. అటు సాంప్రదాయాన్ని.. ఇటు కొత్త తరాన్ని మేళవించిన తీరుగా ఆమె పాత్ర ఉంటుందట.

సాక్ష్యంలో పూజా హెగ్డే డ్రెస్సులు కూడా హైలైట్ అవుతాయని తెలుస్తోంది. వెస్ట్రన్.. ఇండియన్ స్టైల్స్ ను మిక్స్ చేసి.. నీతు లుల్లా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ అద్భుతంగా ఉంటాయట. ఈ చిత్రం విడుదల తర్వాత పూజ కాస్ట్యూమ్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతాయని అంటున్నారు. సాక్ష్యంతో పాటు మహేష్ బాబు- వంశీ పైడిపల్లి కాంబినేషన్ లోను.. ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీలోను పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.