మూడో స్టార్ తోనూ పూజా చిందులు

Thu Jun 14 2018 10:42:47 GMT+0530 (IST)

టాలీవుడ్ లో డ్యాన్స్ అంటే ఈ తరం హీరోల్లో గుర్తొచ్చే పేర్లు మూడు. ఎన్టీఆర్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్.. ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా తమ డ్యాన్స్ మూమెంట్స్ తో అలరిస్తుంటారు. ఈ ముగ్గురితోను చిందులు వేసే అవకాశం.. ఒక హీరోయిన్ కి షార్ట్ గ్యాప్ లో వచ్చిందంటే.. కచ్చితంగా ఆమె సూపర్బ్ డ్యాన్సర్ అయి ఉండాల్సిందే.ఈ భామ ఎవరో కాదు.. డీజే మూవీ అందాల రచ్చ చేసిన పూజా హెగ్డే. దువ్వాడ జగన్నాధంలో అల్లు అర్జున్ తో కలిసి ఈమె వేసిన స్టెప్పులు అదరగొట్టేశాయి. ఆ తర్వాత రంగస్థలం మూవీలో రామ్ చరణ్ తో కలిసి జిగేలురాణి పాటలో ఇరగదీసేసింది. ఇద్దరు మెగా హీరోలను వరుసగా కవర్ చేసేసిందే అనుకుంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ అరవింద సమేతలో నటిస్తోంది పూజా. ఇలా టాలీవుడ్ లో టాప్3 డ్యాన్సింగ్ హీరోస్ చేసేసిన అరుదైన రికార్డు సంపాదిస్తున్న పూజా హెగ్డే.. తనకు డ్యాన్స్ అంటే ప్యాషన్.. పిచ్చి అంటోంది.

మ్యూజిక్ వింటే అసలు తనకు కాళ్లు నిలబడవని.. డ్యాన్స్ చేస్తూనే ఉంటానని అంటున్న పూజా హెగ్డేకు అందుకు తగినట్లుగానే అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకోవడం మాత్రమే కాదు.. అందుకు తగినట్లుగా తన అందాలకు నృత్యాలను చూపించేసి టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తోంది పూజా హెగ్డే.