Begin typing your search above and press return to search.

అప్పట్లో తాగుడుకి బానిస అయ్యానన్న హీరోయిన్

By:  Tupaki Desk   |   23 March 2017 5:28 PM GMT
అప్పట్లో తాగుడుకి బానిస అయ్యానన్న హీరోయిన్
X
నిజాలే అయినప్పటికి ఒప్పుకోవటానికి చాలా దమ్ము ఉండాలి. పైకి ఆదర్శాలు ఎన్ని చెప్పినా.. ప్రాక్టికల్ గా చూసినప్పుడు చాలామంది హిపోక్రసీలో బతికేస్తుంటారు. నిజాల్ని బయటకు చెప్పటానికి అస్సలు ఇష్టపడరు. తమలోని లోపాల్నికప్పిపుచ్చుకోవటమే తప్పించి.. ఓపెన్ గా తాము చేసిన తప్పుల గురించి అస్సలు ప్రస్తావించరు. ప్రముఖల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే ఉండదు.

అలాంటిది ఒక ప్రముఖ సెలబ్రిటీ తనకున్న తాగుడు గురించి ఓపెన్ గా చెప్పటమే కాదు.. దానికి తాను ఎంతలా బానిస అయ్యానన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేసి సంచలం సృష్టించారు బాలీవుడ్ నటి పూజాభట్. తన హాట్ అందాలకు కుర్రకారుకి నిద్రల్లేకుండా చేసిన ఈ భామ తాను మద్యానికి బానిస అయ్యానన్న విషయాన్ని ఒప్పుకున్నారు. తాగుడుకు అలవాటైతే దాన్ని మానుకోవటం చాలా కష్టమని చెప్పారు.

అయితే.. మద్యానికి బానిస అయిన వారు.. దాన్ని మానేయాలంటే తాగుడును ఒక సమస్యలా చూడాలన్న సలహాను ఇస్తున్నారు.సలహాను ఇవ్వటమే కాదు.. తాను ఇదే సూత్రాన్ని అప్లై చేసి..తాగుడుకు దూరమైనట్లుగా వెల్లడించారు. గత ఏడాది క్రిస్ మస్ రోజున తాగుడు అలవాటును మానేయాలని అనుకున్నానని.. అప్పటి నుంచి తాగుడుకుదూరమైనట్లు చెప్పుకొచ్చారు.

చాలామంది తమకు మద్యం అలవాటు లేదని చెబుతారని.. చాలామంది మహిళలు తమకున్న తాగే అలవాటును కప్పిపుచ్చుకోవటానికి ట్రై చేస్తారని.. తమకు అలాంటి అలవాటు లేదని చెబుతారు కానీ.. వారిలో చాలామంది మత్తులోనే ఉండిపోతారని చెప్పుకొచ్చారు.ఏమైనా సినీ సెలబ్రిటీ తనకు తానుగా మద్యానికి బానిసైన విషయాన్ని ఓపెన్ గా ఒప్పుకోవటం గ్రేట్ అని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/