Begin typing your search above and press return to search.

పెళ్లి త‌ర్వాత ఆయ‌న‌తో ఏంటిలా?

By:  Tupaki Desk   |   21 Aug 2019 11:40 AM GMT
పెళ్లి త‌ర్వాత ఆయ‌న‌తో ఏంటిలా?
X
ఒక‌ప్ప‌టి హాట్ బ్యూటీ పూజా భాత్రా పెళ్లి గురించి ఇటీవ‌ల ప్ర‌ముఖంగా వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌త కొంత‌కాలంగా క్యారెక్ట‌ర్ న‌టుడు న‌వాబ్ షాతో స‌హ‌జీవ‌నంలో ఉన్న పూజా జూలై లో దిల్లీ వేదిక‌గా ఓ ప్ర‌యివేటు వెన్యూలో సీక్రెట్ గా వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది మంది కుటుంబ స‌భ్యులు.. బంధు మిత్రుల స‌మ‌క్షంలో ఈ వివాహం జ‌రిగింది.

పెళ్లి త‌ర్వాత ఈ జంట విదేశాల్లో ఒంటరి దీవుల సెల‌బ్రేష‌న్ కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. హ‌బ్బీ న‌వాబ్ తో సాహ‌చ‌ర్యంలోని ఫోటోలు అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యాయి. అయితే త‌న‌కు పెళ్లి అయిన విష‌యాన్ని పూజా బాత్రా కాస్తంత ఆల‌స్యంగానే వెల్ల‌డించింది. పెళ్లికి ముందు ఎంతో ఆలోచించాన‌ని.. బ్యాలెన్స్ లైఫ్ కి ఇత‌డు క‌రెక్ట్ అని భావించాకే చేసుకున్నాన‌ని తెలిపారు. ``ఆర్య స‌మాజంలో పెళ్లి జ‌రిగింది. ఇంకా పెళ్లిని రిజిస్టర్ చేయ‌లేదు. ఈ వారంలో ఆ ఫార్మాల్టీస్ పూర్తి చేస్తామ‌``ని పూజా ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

తాజాగా సామాజిక మాధ్య‌మాల్లో ఈ జంట‌కు సంబంధించిన వేడెక్కించే ఫోటోలు రివీల‌య్యాయి. దాదాపు 30-40 ఫోటోల వర‌కూ ర‌క‌ర‌కాల డిజైన‌ర్ లుక్ లో ఉన్న‌వి అంత‌ర్జాలంలో హీటెక్కిస్తున్నాయి. ఇప్ప‌టికే పెళ్లి ఫోటోలు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. నాగార్జున - మాస్ట‌ర్ అఖిల్ న‌టించిన `సిసింద్రీ` చిత్రంలో పూజా బాత్రా న‌టించారు. మేఘం, జోడీ నంబ‌ర్ 1 చిత్రాల్లోనూ త‌న‌దైన న‌ట‌న‌తో మెరిపించారు. ప‌లు త‌మిళం- హిందీ చిత్రాల్లోనూ ఈ మాజీ మిస్ న‌టించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే.