Begin typing your search above and press return to search.

రాబోయేదంతా రాజకీయమే!!

By:  Tupaki Desk   |   17 April 2018 4:40 AM GMT
రాబోయేదంతా రాజకీయమే!!
X
సాధారణ ఎన్నికలకు సమయం ఇంకా ఏడాదే ఉండటంతో అప్పుడే దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. దానికి తగ్గట్టే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటి నుంచే పాలిటిక్స్ కొత్త మలుపులు తిరుగుతున్నాయి. పాలిటిక్స్ తో క్లోజ్ రిలేషన్ మెయిన్ టెయిన్ చేసే సినిమా రంగంలోనూ ఇప్పుడు రాజకీయాల వేడి కనిపిస్తోంది. ఇన్నాళ్లు ఏడాదికోసారి కూడా కనిపించని పొలిటికల్ జోనర్ సినిమాలు ఇకపై వరసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

రీసెంట్ గా రానా నటించిన నేనే రాజు - నేనే మంత్రి సినిమాతో మళ్లీ పొలిటికల్ జోనర్ సినిమాల సందడి మొదలైంది. తాజాగా మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేసిన భరత్ అనే నేను పూర్తిస్థాయి రాజకీయ చిత్రం. ఇందులో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాయి. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన బాలకృష్ణ తన తండ్రి - విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జీవిత కథతో సినిమా చేస్తున్నాడు. మరోవైపు ఆనందబ్రహ్మ ఫేం డైరెక్టర్ మహి వి. రాఘవ్ మళయాళ నటుడు ముమ్ముట్టితో వై.ఎస్.రాజశేఖర రెడ్డి బయోపిక్ తీస్తున్నాడు. యాత్ర టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కూడా నోటా పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నాడు. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రజల బాధ్యత తెలియజేసేలా ఈ చిత్రం ఉంటుందని మంచు విష్ణు చెబుతున్నాడు. ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ మరిన్ని పొలిటికల్ డ్రామాలు మొదలయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఈ టైంలో జనాలందరి ఫోకస్ పాలిటిక్స్ పైనే ఉంటుంది. కాబట్టి ఈ జోనర్ లో సినిమాలకు ప్రేక్షకులు తొందరగా కనెక్టయ్యే అవకాశముంది.