Begin typing your search above and press return to search.

సినిమా యాక్ట‌ర్లంటే ర్యాషేనా?

By:  Tupaki Desk   |   4 Oct 2015 7:30 PM GMT
సినిమా యాక్ట‌ర్లంటే ర్యాషేనా?
X
అప్ప‌ట్లో రామ్‌ చ‌ర‌ణ్ ఆన్‌ రోడ్ వెళుతూ.. ఓ టెకీతో గొడ‌వ‌ప‌డ్డాడు. మీడియా ఆ వార్త‌ను ప్ర‌సారం చేస్తూ ర‌చ్చ‌రచ్చ చేసింది. అంత‌కంటే ముందే ఓ శుభ‌కార్యం సంద‌ర్భంలో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ పైనా అంతే రచ్చ జ‌రిగింది. ఇటీవ‌లే నిర్మాత సి.క‌ళ్యాణ్ ఓ ఇంటి విష‌యంలో లేడీ అపార్ట్ మెంట్ ఓనర్‌ తో గొడ‌వ‌ప‌డ్డార‌ని ప్ర‌చార‌మైంది. ప‌లు సంద‌ర్భాల్లో ప‌లువురు ఇలాంటి వివాదాల‌తో లైమ్‌ లైట్‌ లోకొచ్చారు.

సెలబ్రిటీలు ప‌ర‌మ ర్యాష్ అంటూ తెగ ప్ర‌చారం సాగించాయి టీవీ చానెళ్లు. లేటెస్టుగా టాలీవుడ్ యంగ్ హీరో త‌నీష్ పైనా ఇలాంటి ప్ర‌చారం సాగింది. అత‌డు రోడ్‌ లో వెళుతూ .. ఓ వ్య‌క్తి స్కూట‌ర్‌ ని ఢీకొట్టి వెళ్లిపోయాడ‌ని ప్ర‌చారం సాగించారు. అయితే ఇలాంటి సంద‌ర్భాల్లో సెల‌బ్రిటీలు కాబ‌ట్టి హ‌డావుడి ఎక్కువ క‌నిపిస్తోంది. వాస్త‌వంగా జ‌రిగిన త‌ప్పు ఇదీ అని ఎవ‌రూ చెప్ప‌డానికి లేని ప్రూఫ్ లేని సంద‌ర్భాలే ఎక్కువ‌. నిన్న‌టిరోజున జ‌రిగిన గొడ‌వ‌లో త‌నీష్ పేరు బైటికి రావ‌డం పెద్ద సంచ‌ల‌నం చేసేశారు.

ఇప్ప‌టికే త‌నీష్‌ కెరీర్ డ‌ల్‌ గా సాగుతోంది. స‌రైన అవ‌కాశాలు లేక తెర‌కు క‌నుమ‌రుగైయ్యాడు. ఆ మ‌ధ్య మంచు ఫ్యామిలీ హీరోలు న‌టించిన పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌లో ఓ ముఖ్య పాత్ర పోషించాడు. కానీ ఆ త‌ర్వాత తెర‌పై క‌నిపించ‌నేలేదు. ప్ర‌స్తుతం అప్ క‌మింగ్ డైరెక్ట‌ర్ల తో సినిమాలు చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలిసింది. అయితే ఇంత‌లోనే ఓ పిడుగు లాంటి వార్త వినాల్సి వ‌చ్చింది. తాజాగా త‌నీష్ ఓ పోలీస్ కేసులో చిక్కుకున్నాడు. రోడ్ నెంబ‌ర్ 45లో ముందు వెళ్తోన్న సురేష్ అనే వ్య‌క్తి స్కూట‌రిస్ట్ ను ఢికొట్టి ఆగ‌కుండా వెళ్లిపోయాడని రుబాబ్ చేశారు. బాధితుడు కారును వెంబ‌డించి ప‌ట్టుకున్నాడ‌ట‌. అనంత‌రం ఇద్ద‌రి మ‌ధ్య కొంత సేపు ఇద్ద‌రి మ‌ధ్య కాసేపు వాగ్వివాదం కూడా చోటు చేసుకుంద‌ట‌. దీంతో ఇద్ద‌రి పై పోలీసులు న్యూసెన్స్ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారని తెలిసింది.

కెరీర్ స‌రిగా లేన‌ప్పుడు ఇలాంటి వివాదాలు పుండు మీద కారంలా మంట పెడ‌తాయి. ఈ యంగ్ హీరో జాగ్ర‌త్త‌ప‌డాల్సిన టైమ్ ఇది. ఇలాంటివి అప్‌ క‌మ్ ట్యాలెంటుకు గుణ‌పాఠాలు గా తీసుకోవాలి. అప్పుడే స‌మ‌స్య‌ల్లో ఇరుక్కోకుండా సామ‌ర‌స్యంగా స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించుకోగ‌ల‌రు.