Begin typing your search above and press return to search.

రాజీవ్ గాంధీ టార్గెట్ గా ‘స్కేర్డ్ గేమ్స్’

By:  Tupaki Desk   |   12 July 2018 10:47 AM GMT
రాజీవ్ గాంధీ టార్గెట్ గా ‘స్కేర్డ్  గేమ్స్’
X
‘స్కేర్డ్ గేమ్స్’.. బాలీవుడ్ లో దుమారం రేపుతున్న వెబ్ సిరీజ్ ఇది. ఇది రెగ్యూలర్ మూవీ కాదు.. కేవలం ‘నెట్ ఫ్లిక్స్’ అనే సమాచార మాధ్యమంలో ప్రసారమయ్యే వెబ్ సిరీస్.ఇదిప్పుడు హిందీ ఇండస్ట్రీని - ఇటు భారతీయ రాజకీయాలను షేక్ చేస్తోంంది. వివాదాల సుడిగుండంలో చికుక్కున్న ఈ వెబ్ సిరీస్ ను ఏమాత్రం ఆపకుండా ప్రసారం చేస్తున్నారు. ప్రేక్షకాదరణలో దూసుకుపోతున్న ఈ సీరియల్ లో ఏకంగా దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని రొచ్చులోకి లాగి రచ్చ రచ్చ చేస్తున్నారు.

‘స్కేర్డ్ గేమ్స్’ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించిన నవాజుద్దీన్ సిద్ధికి రాజీవ్ గాంధీని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఈ ఎపిసోడ్ ను నిలిపివేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు బెంగాల్ కాంగ్రెస్ నేత రాజీవ్ సిన్హా స్కేర్డ్ గేమ్స్ నిర్మాతల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజీవ్ గాంధీ హయాంలోని కొన్ని వాస్తవాలను ఈ వెబ్ సిరీస్ వక్రీకరించిందని ఆరోపించారు.

బూతుకు కేరాఫ్ అడ్రస్ గా ‘స్కేర్డ్ గేమ్స్’ వెబ్ సిరీస్ సాగుతోంది. కంటెంట్ విషయంలో దీనిపై విమర్శలు వస్తున్నాయి. సయిఫ్ అలీఖాన్ - రాధికా ఆప్టే - నవాజుద్దీన్ సిద్ధికీతో పాటు కుబ్రా సేత్ అనే గ్లామర్ డాళ్ ఇందులో మరో కీలక పాత్ర పోషించింది. లింగమార్పిడి చేసుకున్న మహిళగా ఆమె చేసిన పాత్ర.. పురుషుల జననాంగాల్ని ధరించడం వంటి విన్యాసాలు చూడడానికే వెటకారంగా ఉన్నాయని అందరూ ఆడిపోసుకుంటున్నారు.

స్కేర్డ్ గేమ్స్ పుణ్యమా అని ఇప్పుడు కుబ్రా రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ‘ట్రాన్స్ జెండర్ ’ పాత్ర చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందంటూ ఓపెన్ స్టేట్ మెంట్స్ ఇస్తోంది. ఓ సీన్ లో నగ్నంగా కనిపించినందుకు తానేమీ తప్పుగా ఫీలవ్వడం లేదని.. ఆ సీన్ పక్కాగా రావడానికి డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఏడు టేక్ లు తీసుకున్నాడని.. స్క్రీన్ పై దాన్ని అందంగా చూపించారని అంటోంది.