Begin typing your search above and press return to search.

విశాల్ దెబ్బకి స్పైడర్ పైరసీ

By:  Tupaki Desk   |   26 Sep 2017 5:29 AM GMT
విశాల్ దెబ్బకి స్పైడర్ పైరసీ
X
తమిళ హీరో విశాల్ గత కొన్నాళ్లుగా పైరసీపై తెగ రెచ్చిపోతున్నాడు. ముఖ్యంగా తమిళ్ రాకర్స్ నుంచి స్టార్ట్ చేసి.. వరుసగా ఆయా పోర్టల్స్ అడ్మిన్స్ ను అరెస్టులు కూడా చేయిస్తున్నాడు. తన ఫ్యాన్స్ తో కలిసి దాడులు చేస్తూ.. పోలీసులకు పట్టించేస్తున్నాడు. విశాల్ ఇంత యాక్టివ్ గా దాడులు చేస్తున్నా.. రీసెంట్ గా విశాల్ మూవీ తుప్పరివాలన్ కు రిలీజ్ రోజే పైరసీ కాపీ నెట్ లో పెట్టేసి.. పైరసీ పోర్టల్స్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయినా సరే విశాల్ ఏ మాత్రం తగ్గకుండా.. తన దారిని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా జేఎఫ్ డబ్ల్యూ అవార్డ్స్ ఫంక్షన్ జరగగా.. ఏడాదిలోగా అసలు కోలీవుడ్ లో ఎక్కడా పైరసీ అనేదే లేకుండా చేసేస్తానని ఛాలెంజ్ కూడా చేశాడు. విశాల్ ఒకవైపు ఇలాంటి ఛాలెంజులు చేస్తుంటే.. ఆ పైరసీ దారులు ఇంకా రెచ్చిపోతున్నారు. నిజానికి పంపిణీదారుల్లోనే చాలామంది ఈ గ్యాంగులో ఉన్నారనే టాక్ ముందు నుంచీ ఉంది. వారికి పొలిటికల్ కనక్షన్స్ ఉన్నాయట. వాళ్ళని విశాల్ ఎలా ఎదుర్కొంటాడనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే.. విశాల్ ప్రదర్శిస్తున్న దూకుడు.. ఛాలెంజ్ కారణంగా.. మహేష్ బాబు స్పైడర్ టార్గెట్ అయిందట.

మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ లో గ్రాండ్ లాంఛ్ కు రెడీ అయ్యాడు మహేష్. ఇప్పుడా చిత్రాన్ని కూడా రిలీజ్ రోజే పైరసీ చేసేందుకు కొన్ని సైట్స్ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ విషయాన్ని ఇంకా ఎవరూ అఫీషియల్ గా ప్రకటించకపోయినా.. రిలీజ్ రోజునే అంటే సెప్టెంబర్ 27నే స్పైడర్ తమిళ్ వెర్షన్ ను నెట్ లో పెట్టేస్తామనే బెదిరింపులు బయల్దేరాయని టాక్.