Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ట్రూ ట్రామ్ ట్రంక్ లో హాటుపాప

By:  Tupaki Desk   |   9 Oct 2019 1:30 AM GMT
ఫోటో స్టోరీ: ట్రూ ట్రామ్ ట్రంక్ లో హాటుపాప
X
హాటు బ్యూటీలకు ముంబై ఎప్పుడూ కేరాఫ్ అడ్రెస్ గా ఉంది. ఆహనా కుమ్రా కూడా ముంబై భామే. పెరిగిందంతా లక్నోలోనే అయినా పుట్టింది మాత్రం ముంబై.. ఇప్పుడు మకాం కూడా ముంబైలోనే. గార్నియర్.. ఐసిఐసిఐ.. కేఎఫ్సి లాంటి ఎన్నో కార్పోరేట్ బ్రాండ్ల అడ్వర్టైజ్మెంట్లకు మోడల్ గా పనిచేసింది. ఇక టీవీ సీరియల్స్ లోనూ.. వెబ్ సీరీసుల్లో కూడా తన సత్తా చాటింది. బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. ఆహనా నటించిన రీసెంట్ బాలీవుడ్ ఫిలిమ్స్ 'లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా'.. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'.

ఇంట్రో అయిపొయింది కదా. అందరూ బాలీవుడ్ బ్యూటీల తరహాలోనే ఈ భామ ఇన్స్టా తాట తీయడంలో ఎక్స్ పర్టు! రీసెంట్ గా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా లేటెస్ట్ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో.. నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలకు 'ట్రూ ట్రామ్ ట్రంక్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ముంబైలోని ఒక ఫేమస్ రెస్టారెంట్ చెయిన్ అది. ఆ లొకేషన్ లో ఫోటోలు తీయించుకుంది. మెరుస్తూ ఉండే కోటు లాంటి షార్ట్ గౌన్ ధరించి జిగేలు రాణి తరహాలో హాటు పోజులిచ్చింది. ఈ డ్రెస్ కు డీప్ వీ నెక్ ఉండడంతో ఆటోమేటిక్ గా వయ్యారం ఒలికింది. ఫోటోలలో కొన్నిటికి బ్లాక్ అండ్ వైట్ థీమ్ ఎంచుకోవడంతో ఆర్టిస్టిక్ గా ఉన్నాయి.

ఈ ఫోటోలకు నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. హాట్ నెస్ ఈజ్ ఇంజ్యూరియస్ టు పీపుల్.. అంత హాట్ గా ఉండడం చట్టవిరుద్ధం.. బార్ టెండర్ బెదిరిపోయి ఉంటాడు అంటూ రెచ్చిపోయారు. ఒక సంప్రదాయవాది మాత్రం "దసరా రోజు ఈ ఏంటి ఈ రచ్చ అని చిరాకుపడ్డాడు. అయినా హాటు భామలకు పండగలు పబ్బాలతో ఏం పని? ఇక ఆహనా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'షంషేరా' లో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్.. సంజయ్ దత్.. వాణి కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.