టీజర్ టాక్: అదిరే.. రజనీ స్టైల్ అదిరే!

Wed Dec 12 2018 12:37:58 GMT+0530 (IST)

ఈరోజు సూపర్ స్టార్ రజనీ కాంత్ పుట్టిన రోజు.  ఈ స్పెషల్ అకేషన్లో 'పెట్టా' టీమ్ ఒక స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేసింది. రజనీ కాంత్ ప్రత్యేకత అయన స్టైల్ అన్నది అందరూ ఒప్పుకునే విషయమే.  సరిగ్గా అదే స్టైల్ ను హైలైట్ చేస్తూ 'పెట్టా' టీజర్ ను కట్ చేసి తలైవాకు హ్యాపీ బర్త్ డే చెప్పారు.  ఈ ఈజర్లో ఏమాత్రం సినిమా స్టొరీ రివీల్ చెయ్యలేదు.టీజర్ ఓపెన్ చెయ్యగానే రజనీ స్టైల్ గా నడుచుకుంటూ వెళ్తుంటాడు.. ఈ షాట్ ను వెనకవైపునుడి చూపిస్తారు.  నెక్స్ట్ షాట్లో చేతిలో ఒక గిఫ్ట్ లాంటిది పట్టుకుని సైడ్ నుండి ఎంట్రీ ఇస్తాడు. మరో షాట్ లో అటూ ఇటూ ఫ్యాన్స్ దండలు పట్టుకుని స్టెప్పులేస్తూ ఉంటే.. తను కూడా ఒక స్టెప్ వేస్తాడు.  ఇక్కడంతా స్టైలిష్ గెటప్పుల్లో ఉన్న రజనీ నెక్స్ట్ షాట్ లో సంప్రదాయ దుస్తుల్లో పంచెకట్టులోకి మారిపోతాడు. నవ్వుతూ పంచెను పైకి మడిచి కట్టే స్టైలు టీజర్ మొత్తానికి హైలైట్.  టీజర్లో అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఓవరాల్ గా ఇది రజనీ ఫ్యాన్స్ కు పెద్ద ట్రీటే.

కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష.. సిమ్రాన్.. విజయ్ సేతుపతి..బాబీ సింహా.. నవాజుద్ధిన్ సిద్ధిఖీ.. మేఘా ఆకాష్ లు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.