Begin typing your search above and press return to search.

పెట్టా పరాక్ అంటున్న అనిరుధ్

By:  Tupaki Desk   |   15 Dec 2018 5:36 AM GMT
పెట్టా పరాక్ అంటున్న అనిరుధ్
X
కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ 'పెట్టా' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పొంగల్ సీజన్ లో తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు వెర్షన్ విడుదల సంగతి ఇంకా తేలలేదుగానీ తమిళ వెర్షన్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సింగిల్స్ మ్యూజిక్ లవర్స్ ను మెప్పించాయి. తాజాగా మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

'పెట్టా పరాక్' అంటూ సాగే ఈ పాటను అనిరుధ్ స్వయంగా పాడడం విశేషం. టిపికల్ అనిరుధ్ స్టైల్ లో సాగే ఈ వీడియోలో అనిరుధ్ స్టేజి మీద రాక్ స్టార్ మాదిరిగా పాడుతూ హంగామా చేశాడు. రజనీ మాస్ అవతారంలో యంగ్ లుక్ ఉన్న ఫోటోలతో వీడియో చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటివరకూ రిలీజ్ అయిన 'మరణ మాస్'.. 'ఉల్లాల్లా' పాటలకు ఏమాత్రం తీసిపోదు ఈ పాట.

రజనీ గత రెండు మూడు చిత్రాలన్నిటిలో ఆడియో పెద్ద మైనస్. ఒక్క పాట కూడా ఎవరికీ గుర్తులేదు. ఈ పాటలతో రజనీ ఫ్యాన్స్ కు కరువు తీరిపోయినట్టే. రజనీ ఫ్యాన్స్ కు అనిరుధ్ ఓ సూపర్ ఆడియో ఇచ్చాడనడం లో ఏమాత్రం సందేహంలేదు. మీరు కూడా ఒక లుక్కేయండి.