Begin typing your search above and press return to search.

మహేష్‌ కోసం ముగ్గురు మాష్టర్లు!!

By:  Tupaki Desk   |   28 Oct 2016 3:30 PM GMT
మహేష్‌ కోసం ముగ్గురు మాష్టర్లు!!
X
ఇప్పుడు దీపావళికి మహేష్‌ బాబు కొత్త సినిమా ఫస్ట్ లుక్ వస్తుందా? రావట్లేదా? ఆ విషయంపై ఇంతవరకు సూపర్ స్టార్ సైడ్ నుండి ఎటువంటి క్లారిటీ లేదు. అయితే షూటింగ్ మాత్రం నిర్వధికంగా నాన్ స్టాపుగా కానిచ్చేస్తున్నారు. పైగా సినిమాలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ ను మాత్రం ఓ రేంజులో తీర్చిదిద్దుతున్నారట. ఇప్పటికే ముగ్గురు టాప్ క్లాస్ ఫైట్ మాష్టర్లను దించారంటేనే ఆ విషయం మనకు అర్ధమవుతుంది.

ఏఆర్ మురుగుదాస్ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకు ఏజెంట్ శివ లేదా అభిమన్యుడు అనే టైటిల్ ను అనుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటికే ఒక సూపర్బ్ కార్ చేజ్ సీక్వెన్స్ ను పాపులర్ కంపోజర్ పీటర్ హెయిన్స్ మాష్టర్ రూపొందించాడు. మరి బాహుబలి సినిమాకు కంపోజ్ చేసిన మాష్టర్ అంటే.. ఖచ్చితంగా ఆ హైప్ అనేది ఉంటుంది. ఆ తరువాత చెన్నయ్ లో షూట్ చేసిన ఒక యాక్షన్ సీక్వెన్స్ ను అనల్ అరసు రూపొందించాడు. ఈ రెండూ అద్భుతంగా వచ్చాయి అనుకుంటున్న తరుణంలో.. ఇప్పడు సినిమాలోని మూడో యాక్షన్ సీక్వెన్స్ రూపొందించడానికి.. రవి వర్మ రంగంలోకి దిగాడు. చూస్తుంటే ఇండస్ర్టీలో ఉన్న బెస్ట్ టాలెంట్ అందరితోనూ మురుగుదాస్ ఏదో ఒక పని చేయించేలా ఉన్నాడే.

ఆ మధ్యన 1 నేనొక్కడినే వంటి సినిమాలో తన యాక్షన్ సైడ్ చూపించిన మహేష్‌.. తరువాతి సినిమాల్లో మెసేజ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ పై ఫోకస్ పెట్టాడు. అందుకే ఇప్పుడు పూర్తి స్థాయి యాక్షన్ అనేసరికి అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/