Begin typing your search above and press return to search.

బాషా కథ నుండి బయటకురా పవన్

By:  Tupaki Desk   |   27 Nov 2017 11:30 PM GMT
బాషా కథ నుండి బయటకురా పవన్
X
ఇప్పుడు 'అజ్ఞాతవాసి' ఫస్ట్ లుక్ చూశాక్ పవన్ కళ్యాన్‌ అర్జెంటుగా ఒక కథ నుండి బయటకు రావాలంటూ కొన్ని సెటైర్లు వినిపిస్తున్నాయి. కమర్షియల్ సినిమాల్లో హీరోలు ఎప్పుడూ ఒకటే పంధాతో కథలను చేయడం మామూలే కాని.. ఇక్కడ పవన్ మాత్రం ఎప్పుడూ దాదాపు ఒకటే కథను చేస్తున్నాడు. అదే 'బాషా' కథ. పదండి ఆ సంగతేంటో చూద్దాం.

అంటే హీరో ఫస్టాఫ్‌ లో చాలా నిధానస్తుడు అమాయకుడు సింపుల్ మ్యాన్. కాని అతనికో ఫ్లాష్‌ బ్యాక్ ఉందని ఇంటర్వెల్ బ్యాంగ్ తరువాత మనకు అర్ధమవ్వడం. సెకండాఫ్‌ లో అతని టాలెంట్ చూపించడం. అక్కడి నుండి హీరో విజృంభించడం. బాషా అనే సినిమాతో దర్శకుడు సురేష్‌ కృష్ణ సెట్ చేసిన ఫార్మాట్ ఇది. ఆ తరువాత చాలామంది ఇది ఫాలో అయ్యారు. మన సమరసింహా రెడ్డిలు.. ఇంద్రలు.. అన్నీ అవే. ఇక పవన్ కళ్యాణ్‌ విషయానికిస్తే.. అదే మాదిరి స్ర్కీన్ ప్లే ను అటూ ఇటూ తారుమారు చేసి.. బాలు.. పంజా.. నుండి కాటమరాయుడు వరకు ఆ షేడ్ అన్ని సినిమాల్లోనూ కనిపిస్తూనే ఉంది. హీరో ఒక అసమాన డిక్టేటర్ రేంజ్ ఉన్న మనిషి.

చివరకు అత్తారింటికి దారేదిలో కూడా.. ఇప్పటివరకు తెలుగు వాళ్ళలో నిజజీవితంలో కూడా లేనంత రిచ్ గయ్. చార్టెడ్ ఫ్లయిట్ నుండి జాగ్వార్ కార్ వరకు.. ఇట్టే పట్టేసి.. ఏకంగా రైల్వే స్టేషన్ నే ఖాళీ చేయిస్తాడు. అది కూడా బాషా టింజ్ లోనే ఉంటుంది. ఇప్పుడిక 'అజ్ఞాతవాసి' ఫస్ట్ లుక్ చూస్తే కూడా.. ఇందులో కూడా ఒక సాఫ్టువేర్ ఇంజనీర్ గా నటిస్తున్నాడు కాని.. వెనుక పెద్ద బ్యాగ్రౌండ్ ఏదో ఉందని 'ప్రిన్స్ ఇన్ ఎక్సయిల్' అనే కథను చూస్తే తెలుస్తోంది.

కాకపోతే విషయం ఏంటంటే.. అవతల ప్రక్కన తన తోటి బడా స్టార్లు అయిన విజయ్.. అమీర్ ఖాన్ వంటి వారు.. సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలను అనేకం చేస్తుండగా.. పవన్ మాత్రం ఇంకా ఈ 'బాషా' కథలే చేస్తుంటే.. కాస్త సిల్లీ అనిపిస్తోంది. అంత పెద్ద స్టార్ అయ్యాక సామాజిక బాధ్యత తీసుకోకపోతే ఎలా? పబ్లిక్ లో పవన్ చూపించే సామాజిక స్పృహ తెలిసిందే కాని.. సినిమాల్లో అదే చూపిస్తే బాగుంటనేది పలువురి అభిప్రాయం