Begin typing your search above and press return to search.

పెళ్లిచూపులు తర్వాత ఎంత క్రేజ్ అంటే..

By:  Tupaki Desk   |   23 Aug 2016 3:30 PM GMT
పెళ్లిచూపులు తర్వాత ఎంత క్రేజ్ అంటే..
X
ఒక్క సినిమాతో జీవితం మారిపోవడం అంటే ఏంటో ‘పెళ్లిచూపులు’ సినిమాకు పని చేసిన వాళ్లందరికీ అర్థమవుతోంది. ఈ సినిమాలో భాగమైన నటీనటులు.. సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఒక్కసారిగా బిజీ అయిపోతున్నారు. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండ అయితే ఓవర్ నైట్ క్రేజీ హీరో అయిపోయాడు. పెద్ద పెద్ద బేనర్లు.. పేరున్న దర్శకులు అతడి వైపు చూస్తున్నారు. వైజయంతీ మూవీస్.. సూపర్ గుడ్ ఫిలిమ్స్ లాంటి ప్రముఖ బేనర్లతో అతడికి కమిట్మెంట్లున్నాయి. సెన్సిబుల్ డైరెక్టర్ నందిని రెడ్డి అతడితో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న విజయ్ సినిమాలకు కూడా మంచి క్రేజ్ వస్తోంది.

ముఖ్యంగా విజయ్ నెక్స్ట్ రిలీజ్ ‘అర్జున్ రెడ్డి’పై ఫోకస్ బాగా పెరిగింది. ఈ సినిమా కోసం బయ్యర్లలో మంచి క్రేజ్ నెలకొంది. ‘‘పెళ్లిచూపులు పుణ్యమా అని మా సినిమా స్థాయే పెరిగిపోయింది. మా సినిమాను కొనడానికి బయ్యర్లు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఆల్రెడీ బిజినెస్ కోసం అడిగారు. ఐతే ప్రస్తుతానికి మేం ఏం కమిట్మెంట్లు ఇవ్వలేదు. సినిమా విషయంలో మరింత బాధ్యతగా ఉండాలని అర్థమైంది. రెండు నెలల కిందట మేం ఔట్ డోర్ షూటింగ్ చేస్తుంటే మమ్మల్ని పట్టించుకునే నాథుడు లేడు. కానీ ఇప్పుడు రోడ్ల మీద షూట్ చేయడం కష్టమే అవుతోంది. విజయ్ మీద జనాలు అంత ఆసక్తి చూపిస్తున్నారు’’ అని అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వర్మ తెలిపాడు.