Begin typing your search above and press return to search.

కుస్తీ యోధుడి పోరాటం : ట్రైలర్ టాక్

By:  Tupaki Desk   |   22 Aug 2019 8:53 AM GMT
కుస్తీ యోధుడి పోరాటం : ట్రైలర్ టాక్
X
ఈగతో మనకు విలన్ గా పరిచయమైన కిచ్చ సుదీప్ కన్నడలో పెద్ద స్టార్. సైరా నరసింహారెడ్డిలో అరకు రాజుగా కీలక పాత్ర చేసి త్వరలో మరోసారి అలరించేందుకు రాబోతున్న సుదీప్ దాని కన్నా ముందుగా సెప్టెంబర్ 12న పెహల్వాన్ రూపంలో వస్తున్నాడు. దీని ట్రైలర్ ని ఇందాకా మూడు భాషల్లో విడుదల చేశారు. కథ విషయానికి వస్తే కృష్ణ(కిచ్చ సుదీప్)ఉండే ఊరు కుస్తీ పోటీలకు ప్రసిద్ధి. గురువు(సునీల్ శెట్టి) ఆధ్వర్యంలో ఈ విద్యలో రాటుదేలి చుట్టుపక్క గ్రామాల్లో పేరు తెచ్చుకుని ఉంటాడు.

కానీ ఆవేశం మెండుగా ఉండే కృష్ణకు గొడవలు పోలీస్ కేసులు కూడా కామన్. ఓసారి జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే అవకాశం వస్తుంది. గురువు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ ఏర్పాట్లు చేస్తాడు. కానీ ఈ లోపు కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. కృష్ణ జీవితంలో సంఘర్షణ మొదలవుతుంది. ఇందులో నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే పెహల్వాన్ కథ

సుదీప్ లుక్స్ తో అదరగొట్టాడు. దీని కోసమే ప్రత్యేకంగా శరీరాన్ని తీర్చిదిద్దుకున్న తీరు ఆకట్టుకుంది. సునీల్ శెట్టి సీనియారిటీ చూపించాడు. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ ని రివీల్ చేయలేదు. అయితే కథలో గతంలో చూసిన శ్రీహరి భద్రాచలం - సల్మాన్ ఖాన్ సుల్తాన్ ఛాయలు కనిపిస్తాయి. హీరో ఓ విద్యలో రాటుదేలి తర్వాత దానికి దూరం కావడం తర్వాత ఒక లక్ష్యంతో అవార్డులు సాధించడం పాయింట్ వేరే వాటిలో కూడా వచ్చింది.

మరి పెహల్వాన్ లో వాటిలో లేని ప్రత్యేకత ఏముందో ట్రైలర్ ని బట్టి చెప్పలేం కానీ రిలీజయ్యాక ఒక అభిప్రాయానికి రావొచ్చు. కృష్ణ దర్శకత్వం బాగుంది. కరుణాకర్ ఛాయాగ్రహణం అర్జున్ జన్య సంగీతం థీమ్ కు తగ్గట్టు ఉన్నాయి. వచ్చే నెల 12న మూడు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతున్న పెహల్వాన్ సుదీప్ కెరీర్ లో ఇంత భారీగా ఒకేసారి మల్టీ లాంగ్వేజ్ లో రిలీజవుతున్న మొదటి సినిమా. అందుకే శాండల్ వుడ్ అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి