టాలీవుడ్ ను ఊరిస్తున్న కొత్త అందం

Tue May 22 2018 16:46:26 GMT+0530 (IST)

అదేమిటో కానీ కొంతమంది హీరోయిన్లకు ఎన్ని సినిమాలలో కనిపించినా పెద్దగా పాపులారిటీ రాదు కానీ కొందరికి మాత్రం సినిమా వల్ల ఏంటి ట్రైలర్ వల్ల కూడా స్టార్ డమ్ వచ్చి పడుతుంది. అలాంటి ఒక హీరోయినే పాయల్ రాజ్ పుత్. ఇప్పుడు ఈమె పేరు సోషల్ మీడియా లో మారు మ్రోగిపోతోంది.ఢిల్లీలో పెరిగిన ఈ పంజాబీ అందం కొన్ని టీవీ సీరియళ్ళలో కనిపించి తరువాత తన మాతృ భాష అయిన పంజాబిలో చిన్న మేరేయా సినిమాతో అరంగేట్రం చేసింది. మరాఠీ సినిమా సైరట్ కు రీమేక్ గా విడుదల అయిన ఈ చిత్రం పెద్ద హిట్ అవడమే కాదు పాయల్ కు ఫిల్మ్ ఫేర్ కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈమె RX100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ఈమధ్యనే విడుదల కాగా ఈమె అందాల ఆరబోత హై లైట్ గా నిలిచింది సుమా. ట్రైలర్ లో పల్లెటూరి అమ్మాయిలాగా పద్దతిగా ఉండే బట్టలు వేసుకున్నా ఇప్పుడు అందరు హీరోయిన్ల లాగా ఈమె కుడా గ్లామర్ షో కు నేను అతీతం కాదు అన్న లెవెల్ లో సోషల్ మీడియా లో తన ఫోటోలు పోస్ట్ చేస్తోంది.

ఈమె సినిమా కనీసం రిలీజ్ కూడా అవ్వలేదు కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఈమె ఇప్పటికే ప్రేక్షకుల మనసులని కొల్లగొట్టేసింది. ఇలానే కొనసాగితే స్టార్ హీరోయిన్లను సైతం తలదన్ని టాలీవుడ్ లో తనకంటూ ఒక రేంజ్ ఏర్పరుచుకుంటుంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.