Begin typing your search above and press return to search.

ఆరు ల‌క్ష‌ల‌కే అందాల‌ ఆర‌బోతా?

By:  Tupaki Desk   |   14 July 2018 1:13 PM GMT
ఆరు ల‌క్ష‌ల‌కే అందాల‌ ఆర‌బోతా?
X
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.....ఇలా ఏ ఇండ‌స్ట్రీలోనైనా...హీరోయిన్ కావాల‌నే ఆశ‌తో వేలాదిమంది యువ‌తులు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఏదైనా చిన్నా చిత‌కా సినిమాలోనైనా అవ‌కాశం వ‌స్తే ....టాలెంట్ ప్రూవ్ చేసుకొని త‌ర్వాత పెద్ద సినిమాల్లో రాణించొచ్చ‌ని క‌ల‌లు కంటుంటారు. త‌మ‌కు వ‌చ్చిన ఫ‌స్ట్ చాన్స్ ను వ‌దులుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. అయితే, త‌మ‌కు వ‌చ్చిన తొలి సినిమాలోనే బీభ‌త్స‌మైన అందాల ఆర‌బోత‌...లెక్కు మించిన లిప్ లాక్ లు...విభిన్న‌మైన క్యారెక్ట‌ర్.....ఇవన్నీ ఉంటే మాత్రం ఆ సినిమాలో చేయ‌డామిని ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌రు. ఎందుకంటే, తొలి సినిమాలో ఆ త‌ర‌హా ముద్ర ప‌డితే...ఇక కెరీర్ లో త‌మ అందాల‌ను ధారాళంగా ఆరబోయాల్సి ఉంటుంద‌నే కార‌ణంతో నో చెబుతారు. ఒక‌వేళ ఎస్ చెప్పినా....ఆ త‌ర‌హా పాత్ర‌లో న‌టించినందుకు భారీ పారితోషికం తీసుకుంటారు. అయితే, ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన `ఆర్ ఎక్స్ 100` హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్ మాత్రం....ఆ పాత్ర‌కు కేవ‌లం ఆరు ల‌క్ష‌ల పారితోషికం తీసుకోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే.

`ఆర్ ఎక్స్ 100`లో హీరోయిన్ పాత్ర‌...లిప్ లాక్ లు చెప్పిన త‌ర్వాత‌...ఒక్కరూ ముందుకు రాలేద‌ట‌. ముందు హీరో సీన్లు షూట్ చేద్దామ‌ని అనుకుంటున్న త‌రుణంలో రాజ్ పుత్ పేరు తెర‌పైకి వ‌చ్చింద‌ట‌. ఆ త‌ర్వాత `ఆర్ ఎక్స్ 100` పాయల్ రాజ్ పుత్ ఓ రేంజ్ లో నటించిన సంగ‌తి తెలిసిందే. రెండు మూడు లిప్ లాక్ లు అందులో...2 నిమిషాల నిడివి గ‌ల లిప్ లాక్ ఒక‌టి.....ఇలా త‌న తొలి సినిమా కోసం బాగానే క‌ష్ట‌ప‌డింది పాయ‌ల్. అయితే, మొద‌టి సినిమాలోనే ఎక్స్ పోజ్ చేయ‌డానికి ఏమాత్రం వెనుకాడ‌లేదీ అమ్మడు. అయితే, ఇంత చేసినా కూడా...ఈ సినిమాకు ఆమె తీసుకుంది కేవ‌లం 6 ల‌క్ష‌లేన‌ట‌. అయితే, మొద‌టి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మ‌డికి....టాలీవుడ్ లో రెండు మూడు చాన్స్ లు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అయితే, నార్త్ లో ఇప్ప‌టికే క‌మిట్ అయిన రెండు మూడు ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకొని....టాలీవుడ్ కు రావాల‌ని పాయ‌ల్ ప్లాన్ చేస్తోంద‌ట‌. మ‌రి, హీరోయిన్ల కొర‌త ఉన్న టాలీవుడ్ లో...పాయ‌ల్ ఎంత‌వ‌ర‌కు పాగా వేస్తుందో వేచి చూడాలి.