ఆరెక్స్ బ్యూటీకి ఆ ఆఫర్ లేదట!

Wed Feb 20 2019 11:02:36 GMT+0530 (IST)

పాయల్ రాజ్ పుత్ డెబ్యూ సినిమా 'RX100' సంచలన విజయం సాధించడంతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది.  సహజంగా అలాంటి సూపర్ హిట్ సాధించిన తర్వాత ఫుల్ గా ఆఫర్లు రావాలి కానీ ఎందుకో అలా జరగడం లేదు. యువ హీరోల సరసన ఆఫర్లేవీ రాలేదు కానీ రీసెంట్ గా 'మన్మధుడు 2' లో నాగార్జున  సరసన నటించే అవకాశం వచ్చిందని.. 'వెంకీమామ' లో వెంకటేష్ కు జోడీగా నటించే ఆఫర్ వచ్చిందని ప్రచారం సాగింది. తాజా సమాచారం ప్రకారం 'మన్మధుడు' సీక్వెల్ లో నటించే ఆఫర్ పాయల్ కు రాలేదట.   'మన్మధుడు 2' టీమ్ వారు పాయల్ ను ఇంతవరకూ సంప్రదించలేదట.  ఆ ప్రచారం అంతా ఒట్టిదేనట.  ఈ ఆఫర్ రాకపోతే రాకపోయింది మరి 'వెంకీమామ' ఆఫర్ అయినా ఉందా లేదా అనేది మనకు కొద్దిరోజులలో క్లారిటీ వస్తుంది.  నటన విషయంలో.. బోల్డ్ నెస్ విషయంలో తన టాలెంట్ ను చూపించి ప్రేక్షకులను మెప్పించిన పాయల్ మంచి ఆఫర్ల కోసం మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పేలా లేదు .

ఫ్యూచర్ ప్రాజెక్టుల సంగతేమో గానీ ప్రస్తుతం పాయల్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.  అందులో ఒకటి తమిళ సినిమా 'ఏంజెల్' ..మరొకటి భానుశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలుగు సినిమా.