ఆర్.ఎక్స్ లో అమ్మాయి స్పీడే ఎక్కువంట

Wed Jul 11 2018 16:19:49 GMT+0530 (IST)

అందరి దృష్టీ రేపు విడుదల కానున్న `ఆర్.ఎక్స్.100`పైనే ఉంది.  ఆ సినిమా టీజర్లు - ట్రైలర్లు అంత ఆసక్తిని రేకెత్తించాయి. నేపథ్యం వేరే అయినా...  అర్జున్ రెడ్డి తరహా 'రా' నేపథ్యంతో ఈ చిత్రం రూపొందినట్టు అర్థమవుతోంది.  ట్రైలర్లో ముద్దు సన్నివేశాలు  మాత్రం మరోసారి అర్జున్ రెడ్డిని గుర్తు చేస్తున్నాయి. చిత్రబృందం కూడా `మా సినిమాలో ఎన్ని ముద్దులుంటాయని అడగొద్దండి - ఎంతసేపుంటాయని అడగండ`ని చెబుతుండటంతో ముద్దు సన్నివేశాలు మరింత ఆత్రుతని కలిగిస్తున్నాయి ప్రేక్షకుల్లో.  ఈ సినిమా చిత్రబృందం మొత్తం కథానాయిక పాత్ర స్పీడు గురించి ప్రత్యేకంగా చెబుతోంది. అమ్మాయిలంటే ఇలాగే ఉండాలనే ఓ నియమం పెట్టుకొని... అందుకు అనుగుణంగానే పాత్రల్ని తీర్చిదిద్దుతుంటారని ఇందులో అమ్మాయి మాత్రం అందరి అంచనాలకి భిన్నంగా ఉంటుందని మొన్న సీనియర్ నటుడు రాంకీ - నిన్న కథానాయకుడు కార్తికేయ చెప్పారు.  దీన్నిబట్టి అమ్మాయి పాత్రని బోల్డ్ గా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. మొత్తంగా కథానాయిక పాయల్ రాజ్ పుత్ ఈ చిత్రంతో సంచలనాలు సృష్టించేలాగే కనిపిస్తోంది. ఆమె కూడా మొన్న అంతే బోల్డ్‌గా ముద్దులు పెట్టుకుంటే తప్పేంటి అని సమాధానం చెప్పింది.  మరి ఈ సినిమాలో ఏ పాత్ర వేగం ఎంతుందో తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే. అయితే చిత్రబృందం మాత్రం ధైర్యంగా హైదరాబాద్ లో ఈరోజు రాత్రే ప్రీమియర్ ని ఏర్పాటు చేసి మీడియాని ఆహ్వానించింది. దీన్నిబట్టి సినిమాపై వాళ్లకున్న కాన్ఫిడెన్స్ ఏపాటిదో అర్థమవుతుంది.