Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఆర్డీఎక్స్ బ్యూటీ స్పైసీ పోజు

By:  Tupaki Desk   |   14 Sep 2019 8:35 AM GMT
ఫోటో స్టొరీ: ఆర్డీఎక్స్ బ్యూటీ స్పైసీ పోజు
X
'RX100' టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన భామ పాయల్ రాజ్ పుత్. త్వరలో 'RDX లవ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమానే కాకుండా పాయల్ చేతిలో ఆఫర్లు ఫుల్లుగా ఉన్నాయి. అటు వెంకటేష్ - నాగ చైతన్యల క్రేజీ మల్టి స్టారర్ 'వెంకీమామ' లో హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా 'డిస్కోరాజా' లో కూడా పాయల్ హీరోయిన్. ఇవే కాదు పాయల్ కు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో అవకాశం వచ్చిందట

సీనియర్ డైరెక్టర్ తేజ కొత్త సినిమాలో పాయల్ ను హీరోయిన్ గా తీసుకుందామని అనుకుంటున్నారట. తేజ లాస్ట్ సినిమా 'సీత' లో పాయల్ ఒక స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తేజ దర్శకత్వంలోనే పూర్తి స్థాయి హీరోయిన్ గా నటించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాలో మొదట కాజల్ ను హీరోయిన్ గా అనుకున్నారని.. అయితే 'సీత' బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలవడంతో కాజల్ ఈ సినిమాలో నటించేందుకు వెనకడుగు వేసిందనే టాక్ ఉంది. అందుకే కాజల్ స్థానంలో పాయల్ ను ఫిక్స్ చేశారని అంటున్నారు.

అయితే ఈ డెవలప్మెంట్స్ తో సంబంధం లేకుండా పాయల్ తన ఇన్స్టా ఖాతాలో హాటు ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను కాల్చుకు తింటోంది. ఒక కత్తి లాంటి ఫోటో పోస్ట్ చేసి "మీలాగే ఉండండి. ప్రపంచం సర్దుకుంటుంది" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఫోటోలో బ్యాక్ ఓపెన్ ఉండే గ్రీన్ కలర్ గౌన్ ధరించి మత్తుగా నవ్వుతూ కళాపోషకుల హృదయాలను చిత్తు చేస్తోంది. చేతికి పెట్టుకున్న కడియం లాంటిది వెరైటీగా ఉంది. అసలే పాయల్ ఇప్పుడు ఆర్డీఎక్స్ బ్యూటీ కాబట్టి తన ఎక్స్ ప్రెషన్ కూడా ఆర్డీఎక్స్ బాంబు లానే ఉంది. ఫోటో పోస్ట్ చేసి జస్ట్ గంటే అయింది కానీ రెస్పాన్స్ మాత్రం అదిరిపోయింది. "హాట్నెస్ కు డెఫినిషన్".. "సూపర్ సెక్సీ".. "స్పైసియస్ట్ కర్వ్స్" అంటూ తమ స్పందన తెలిపారు.