ఫ్యాన్స్ ని రెచ్చగొట్టిన పాయల్

Fri Mar 15 2019 10:39:11 GMT+0530 (IST)

ఆర్.ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన నాయికగా నటిస్తూ బిజీగా ఉంది. బోల్డ్ & డస్కీ బ్యూటీగా ఇప్పటికే ఈ బ్యూటీ పాపులరైంది. తెలుగు రాష్ట్రాలు సహా పంజాబ్ తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించేసింది. పాయల్ బోల్డ్ యాక్టింగ్ స్కిల్స్ కి ఫిదా అవ్వని కుర్రాడే లేడు. కారణం ఏదైనా ఈ అమ్మడితో సినిమాలు చేసేందుకు మన దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు కుర్రాడు భాను శంకర్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది.వీటితో పాటు ఇండస్ట్రీ క్రేజీ చిత్రాలుగా పాపులరవుతున్న వెంకీ మామ మన్మధుడు 2 చిత్రాల్లోనూ పాయల్ ఓ కథానాయికగా ఎంపికై ఒక్కసారిగా వేడి పెంచింది. ఆర్.ఎక్స్ 100 తర్వాత తామర తంపరగా తనవైపు వచ్చిన అవకాశాలకు ఎడా పెడా సంతకాలు చేసేయకుండా తెలివిగా కెరీర్ ని ప్లాన్ చేస్తోంది. వెంకటేష్ నాగార్జున లాంటి స్టార్ హీరోల  సరసన పాయల్ అవకాశాలు అందుకోవడం ఓ మిరాకిల్. ప్రస్తుతం వరుస షెడ్యూల్స్ తో హైదరాబాద్ టు చెన్నయ్ చెన్నయ్ టు పంజాబ్ పరుగులు పెడుతోందట.

మరోవైపు సామాజిక మాధ్యమాల్లోనూ ఈ అమ్మడి స్పీడ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. రెగ్యులర్ బేసిస్ లో కుర్రాళ్లకు విజువల్ ట్రీట్ అందిస్తోంది. తాజాగా మరోసారి ఫ్యాన్స్ ను కవ్విస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. బాత్రూమ్ లో అలా టాప్ లేపేయబోయి ఎంత పెద్ద ట్విస్టిచ్చిందో!! ఆ సీన్ లో బోయ్స్ అలా నన్ను చూసేస్తే గుండె ఆగిపోతుంది!!! అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ నే ఇచ్చింది. ట్రిక్స్ ప్లే చేస్తూ ట్రాప్ లో వేసేస్తూ పాయల్ ఎంత గడుసు పిల్లో చెప్పకనే చెబుతోంది.
   
For Video Click Here