Begin typing your search above and press return to search.

పవన్ బెంజ్ కార్ అమ్మేసుకున్నాడా??

By:  Tupaki Desk   |   27 July 2016 10:14 AM GMT
పవన్ బెంజ్ కార్ అమ్మేసుకున్నాడా??
X
ఒక ప్రక్కన పవన్‌ కళ్యాణ్‌ తానే స్వయంగా ఆర్ధికంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్నానంటూ ఒక బాలీవుడ్‌ క్రిటిక్ కు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు. మరో ప్రక్కన సర్దార్ వంటి సినిమాకు విపరీతమైన ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి.. ఆయన కష్టాలన్నీ గట్టెక్కేసినట్లే అనుకున్నారు అందరు. ఇప్పుడు మాత్రం.. పవన్ ఇంకా ఆర్ధికంగా పుంజుకోలేదని అందుకే తన కార్లను కూడా అమ్ముకుంటున్నాడని అంటున్నారు కొందరు.

తన మెర్సిడెస్ బెంజ్ జి55 మోడల్ కారును పవన్ అమ్మేశాడని ఫిలిం నగర్లో టాక్‌ వినిపిస్తోంది. ఈ కారు మోడల్ ఎప్పుడో ఆపేశారు బెంజ్ కంపెనీ వారు. అప్పట్లో 1.5-2 కోట్లు ధర ఉన్న ఈ కారు ఇప్పుడు సెకండ్ హ్యాండులో అమ్మితే కనీసం 80 లక్షలు కూడా రావేమో. కాకపోతే పవన్‌ వాడిన కారు అనే బ్రాండ్ వాల్యూతో ధర 1 కోటి వరకు పలికితే పలకొచ్చు. కాని కేవలం 1 కోటి రూపాయల కోసం.. దాదపు 15 కోట్లు పారితోషకం తీసుకుంటున్న పవన్ కారును అమ్మేస్తాడా?

అమ్మితే గిమ్మితే కేవలం మరో కొత్త కారు కొనుక్కోవడానికి అయ్యుండొచ్చు కాని.. ఖచ్చితంగా అదేదో ఆర్ధిక ఇబ్బందుల వలన మాత్రం కాదు అంటున్నారు ఆయన సన్నిహితులు. పైగా తన స్నేహితుడు శరత్ మరార్ ద్వారా నార్త్ స్టార్ ఎంటర్టయిన్మంట్ బ్యానర్ పై తానే స్వయంగా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడని అని వార్తలు వినిపిస్తున్న తరుణంలో.. కారు అమ్మడం అనేదే చాలా చిన్న విషయం.