Begin typing your search above and press return to search.

షూటింగ్ లో ప‌వ‌న్ కు గాయం?

By:  Tupaki Desk   |   21 Oct 2017 10:06 AM GMT
షూటింగ్ లో ప‌వ‌న్ కు గాయం?
X

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ 25 వ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రానికి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ దాదాపు ఖ‌రారైన‌ట్లే. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ ...జ‌న‌సేన కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉండ‌బోతోన్న నేప‌థ్యంలో చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ప్రస్తుతం కర్ణాటక - చిక్ మంగుళూరు ప్రాంతాల‌లో కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప‌వ‌న్‌ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ కోసం కీలకమైన యాక్షన్ పార్ట్ ను అక్క‌డ‌ చిత్రీకరించార‌ట‌. పవన్ ఫ్యాన్స్ కోసం ప్ర‌త్యేకంగా ఈ ఫైట్స్ ను త్రివిక్రమ్ డిజైన్ చేయించినట్టు సమాచారం.

ప‌వ‌న్‌ - త్రివిక్ర‌మ్ ల కాంబోలో తెర‌కెక్కిన జ‌ల్సా - అత్తారింటికి దారేది చిత్రాల‌లో ప‌వ‌న్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్లు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. అదే త‌ర‌హాలో ఈ సినిమాలో కూడా అద్భుత‌మైన‌ యాక్షన్ ఎపిసోడ్ ను త్రివిక్ర‌మ్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఈ యాక్ష‌న్ పార్ట్ సంద‌ర్భంగా పవన్ చేతికి గాయమైన‌ట్లు స‌మాచారం. అయినా దానిని లెక్కచేయకుండగా ప‌వ‌న్ షూటింగులో పాల్గొంటున్నాడట‌. హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు త్రివిక్రమ్ ...ఈ సినిమాపై ప్ర‌త్యేక‌ శ్రద్ధ తీసుకుంటున్నాడట‌. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్‌ విదేశాలలో ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న‌ కీర్తి సురేశ్ - అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు.