Begin typing your search above and press return to search.

త్రివిక్ర‌మే కాదు... ప‌వ‌న్ కూడా కార‌ణ‌మే?

By:  Tupaki Desk   |   24 Feb 2018 10:06 AM GMT
త్రివిక్ర‌మే కాదు... ప‌వ‌న్ కూడా కార‌ణ‌మే?
X
అజ్ఞాతవాసి సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై... అంతే భారీ స్థాయిలో అట్ట‌ర్ ఫ్లాఫైంది. ప‌వ‌న్ అభిమానులు ఏంట్రా బాబు సినిమా అని త‌ల‌ప‌ట్టుకునేలా ఉంది. అప్ప‌ట్లో సినిమా పోవ‌డానికి త్రివిక్ర‌మే కార‌ణ‌మ‌న్న‌ట్టు అభిమానులే కాదు... విమ‌ర్శ‌కులు కూడా గోల‌గోల చేశారు. త్రివిక్ర‌మ్ సినిమా అంటేనే భ‌య‌ప‌డేంత‌గా కామెంట్లు చేశారు. కానీ ఇప్పుడు మ‌రో కార‌ణం కూడా ఉందేమో అని అభిమానుల‌కు అనిపిస్తోంది. ఆ కార‌ణం చాలా పెద్ద‌దే.

అజ్ఞాతవాసి వీడియో సాంగ్స్ ఇటీవ‌లే యూట్యూబ్‌లో విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్‌. ఆ సాంగ్స్‌ను ఇప్పుడు చూస్తున్న వారికి సినిమా పోవ‌డానికి కొత్త కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక్క త్రివిక్ర‌మే కాదు... ఇంకా ఎన్నో కార‌ణాలు సినిమాను ఫ్లాఫ్ చేశాయ‌ని జ్ఞానోద‌యం అవుతోంది వారికి. ఆ కార‌ణాల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌ట‌న కూడా ఒక‌టి. షాక‌నిపిస్తున్నా ఇది నిజ‌మే. ఎందుకంటే యూట్యూబ్ లో పెట్టిన రెండు పాట‌ల్లో ప‌వ‌న్ డ్యాన్సులు చూస్తే అలాగే అనిపిస్తుంది. ఏమాత్రం ఆస‌క్తి లేకుండా ఏదో అలా చేసేసిన‌ట్టు ఉన్నాయి. ఒక్కో పాట షూటింగ్‌ కు కేవ‌లం రెండు రోజులే ప‌వ‌న్ కేటాయించాడంటే అర్థం చేసుకోవ‌చ్చు... ఎంత త్వ‌ర‌గా చేసి ప‌డేశాడో.

జ‌న‌సేన పార్టీ పెట్టాక సినిమాపై ప‌వ‌న్ కు ఆస‌క్తి త‌గ్గిపోతూ వ‌చ్చింది. ఆ విష‌యంపై ప‌వ‌న్ కూడా చాలా సార్లు చెప్పాడు. అందుకే అజ్ఞాతవాసి సినిమాను ఆయ‌న అంత సీరియ‌స్‌ గా తీసుకోలేద‌ని ఈ డ్యాన్సుల ద్వారా అర్థ‌మ‌వుతుంది. ఆ రెండు పాట‌ల్లో ప‌వ‌న్ క‌న్నా కీర్తిసురేష్‌ - అను ఇమ్మాన్యుయేల్ కే ఎక్కువ మార్కుల ప‌డ్డాయంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఒక్క త్రివిక్ర‌మే కాదు.. ప‌వ‌న్ కూడా సినిమా న‌ట్టేట మున‌గ‌డానికి కార‌ణ‌మేనంటున్నారు సినీజ‌నాలు.