Begin typing your search above and press return to search.

పవన్.. ఎన్టీఆర్.. కెమిస్ర్టీ అద్భుతహా!!

By:  Tupaki Desk   |   23 Oct 2017 8:00 AM GMT
పవన్.. ఎన్టీఆర్.. కెమిస్ర్టీ అద్భుతహా!!
X
అనుకున్నట్లే ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్‌ క్లాప్ కొట్టగా.. త్రివిక్రమ్ డైరక్ట్ చేయగా.. ఎన్టీఆర్ దేవుడు పటాలకు దణ్ణాలు పెడుతున్నప్పుటు.. ఎన్టీఆర్ 28వ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ ముహూర్తం ఈవెంట్లో ముఖ్యంగా పవన్ అండ్ ఎన్టీఆర్ మధ్యన కనిపించిన కెమిస్ర్టీ గురించి మనం చెప్పుకోవాల్సిందే.

నిజానికి ఈ ఇద్దరూ గతంలో రామ్ చరణ్‌ పెళ్ళిలో ఓసారి కలసి.. గంటపాటు తెగ మాట్లాడేసుకున్నారు. అప్పుడే వీళ్లను చూస్తే చాలా ముచ్చటేసింది. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ విధేయంగా.. పవన్ ఎప్పటిలాగే కాస్త సిగ్గరిలా.. భలే ఉన్నారులే ఇద్దరూ. అంతేకాదు.. పవన్ క్లాప్ బోర్డు పట్టుకుని.. అచ్చం ఒక అసిస్టెంట్ డైరక్టర్ లా బిహేవ్ చేశాడు. క్లాప్ కొట్టగానే ఫీల్డ్ లో నుండి క్లియర్ అన్నట్లు.. కింద కూర్చున్నాడు. అప్పటికే కళ్ళుమూసుకుని దేవుడికి దణ్ణం పెట్టుకున్న ఎన్టీఆర్ నవ్వుతూ కనిపించాడు. కాని ఒక్కసారిగా పవన్ అలా కిందకు కూర్చోవడం చూడగానే ఇంకా నవ్వొచ్చేసింది. ఇద్దరూ కలసి ఆ తరువాత ఆలింగనం చేసుకున్నారు. వారి మధ్యన ఉన్న ఆప్యాయత అక్కడున్న అభిమానులకు కూడా షాకిచ్చింది అంతే. కొంతమంది పవర్ స్టార్ అని కొందరు జై ఎన్టీఆర్ అని అరుస్తూ ఆ ప్రాంగణాన్ని చాలా ఆనందం మరియు స్నేహానికి హరివిల్లు తరహాలో నింపేశారు.

అసలు చూస్తుంటే.. త్రివిక్రమ ఇలా ఇండస్ర్టీలో ఉన్న చాలామందికి పవన్ కళ్యాణ్‌ను మంచి స్నేహితుడుగా చేస్తున్నాడా అనిపిస్తోంది. మరో విషయం ఏంటంటే.. పవన్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరూ కలసి అనిరుధ్ ను మధ్యలో నుంచోబెట్టి ఫోటోలు దిగారు. అప్పుడు ఇద్దరూ కలసి అతడ్ని ఏడిపించారు. అలాగే నటుడు, పవన్ చిన్ననాటి స్నేహితుడు అయిన నర్రా శ్రీనివాస్ ను కూడా అలాగే ఏడిపించారు. మొత్తానికి ఎన్టీఆర్28 లాంచింగ్ అద్భుతహా అనాల్సిందే.