Begin typing your search above and press return to search.

ఇప్పుడు మొదలైంది, ఎండ్‌ ఎప్పుడవ్వుద్దో

By:  Tupaki Desk   |   30 July 2015 4:08 AM GMT
ఇప్పుడు మొదలైంది, ఎండ్‌ ఎప్పుడవ్వుద్దో
X
పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో గబ్బర్‌ సింగ్‌ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆన్‌ సెట్స్‌ ఉంది. హైదరాబాద్‌ ఔట్‌ స్కర్ట్స్‌ లో ప్రస్తుతం యాక్షన్‌ ఎపిసోడ్స్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో శరవేగంగా పూర్తి చేసి రిలీజ్‌ చేయాలన్నది బాబి అండ్‌ టీమ్‌ ప్లాన్‌. అయితే ఎప్పటికప్పుడు వాయిదాల పద్ధతిలో ఈ సినిమా సెట్స్‌ కెళ్లడం పవన్‌ అభిమానుల్ని నిరాశపరుస్తూనే ఉంది.

ఇప్పటికే పవర్‌ స్టార్‌ గబ్బర్‌ సింగ్‌ తర్వాత ఓ పూర్తిస్థాయి ఎంటర్‌ టైనర్‌ లో నటించలేదన్న అసంతృప్తి అభిమానుల్లో ఉంది. గోపాల గోపాల లో నటించినా అందులో పవన్‌ పాత్ర చాలా స్వల్పం. ఆ సినిమాలో అసలు హీరో వెంకీనే. అందుకే పవన్‌ గోపాలునిగా ఆకట్టుకున్నా.. పూర్తి స్థాయి సినిమాలో చూడాలన్న ఆత్రం అభిమానుల్లో పెరిగింది. అయితే గబ్బర్‌ సింగ్‌ 2 రకరకాల కారణాలతో ఆలస్యం అవుతూనే ఉంది. ఈ ఆలస్యం ఫ్యాన్స్‌ కి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితిని తెచ్చింది. ఓవైపు మహేష్‌, ప్రభాస్‌ రికార్డుల్ని తిరగరాస్తూ స్పీడ్‌ పెంచేస్తుంటే పవన్‌ మాత్రం పూర్తిగా నెమ్మదిగా ముందుకు వెళుతున్నాడన్న అసంతృప్తి పెరిగిపోతోంది. అయితే దీనికి గబ్బర్‌ సింగ్‌ 2 సమాధానం చెబుతుందన్న ఆశ అభిమానుల్లో ఉంది. ఇప్పటికైతే రెండో షెడ్యూల్‌ మొదలైంది.

ఓ వైపు పవన్‌ సినిమాతో పాటు బన్ని సినిమా కూడా ఇటీవలే ఆన్‌ సెట్స్‌ వెళ్లింది. అయితే ఈ సినిమా కూడా టేకాఫ్‌ అవ్వడం ఆలస్యమవుతూనే ఉంది. బన్ని సరసన నాయికని ఎంపిక చేయాల్సి ఉందింకా. ఇటీవలి గోదావరి పుష్కరాల్లో బోయపాటి బిజీ అయిపోయాడు. ఇక పుష్కరాలు ముగిశాయి. బన్నితో కలిసి ఈ రోజునుంచే షెడ్యూల్‌ ని యధావిధిగా ప్రారంభించాడు. రెండు మెగా సినిమాలు ఇప్పుడు స్వింగులోకి వచ్చాయి. ఎప్పటికి పూర్తవుతాయో వెయిట్‌ అండ్‌ సీ.