పవన్ మూడు సినిమాల కహానీ

Sun Jan 14 2018 05:00:01 GMT+0530 (IST)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తరువాత పూర్తిగా రాజకీయాల్లోకి రావాలని చాలా ప్రాణాళికలని సిద్ధం చేసుకున్నాడు. కానీ ఆ సినిమా ఎవరు ఊహించని విధమైన రిజల్ట్ ని ఇచ్చింది. పవన్ పై విమర్శలు చేసిన వారికి ఈ సినిమాతో సమాధానం చెబుతాడాని అందరు అనుకున్నారు. కానీ రివర్స్ లో విమర్శకులకు అజ్ఞాతవాసి బూస్ట్ ఇచ్చాడు. అభిమానులు కూడా సినిమా రిజల్ట్ పై ఎంతో బాధలో ఉన్నారు. తన సినిమా ప్లాప్ అయితే పవన్ ఎక్కువగా పట్టించుకోడు కానీ ఇప్పుడు అజ్ఞాతవాసి కొట్టిన దెబ్బకు ప్రతికారం తీర్చుకోవాలని అనుకుంటున్నాడు.దీంతో రాజకీయాల్లో ఉంటూనే వరుసగా మూడు సినిమాలని తెరకెక్కించేలా ప్లాన్ చేయాలని పవర్ స్టార్ డిసైడ్ అయ్యారట. ఇంకా ఎన్నికలకు కరెక్ట్ గా రెండేళ్ల సమయం ఉంది. అంటే ఒక యేడాది ముందే ప్రత్యక్ష రాజకీయాల్లో జనాల ముందు ఉండాలి. అంటే పవన్ ఈ 2017 ఎండింగ్ లోపే ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. 2019 ఎలక్షన్ నాటికి ఫైనల్ గా పవన్ మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవాలని చూస్తున్నాడు. అయితే కేంద్రం నుంచి ఒక రూమర్ ఆందోళన పరిచే విధంగా ఉంది. ముందస్తు ఎన్నికలు రావచ్చు అని ఇటు కేసీఆర్ అటు చంద్రబాబు నాయకులను అప్రమత్తం చేస్తున్నారు.

ఇక విషయాన్ని పక్కనపెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ దర్శకులను ఎంచుకుంటారు అనేది ఆసక్తికరంగా మరింది. నిర్మాత ఏఎమ్.రత్నం తో పవన్ తో సినిమాను చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న ఆ మధ్య నెక్స్ట్ సినిమా పవన్ తోనే అని చెప్పాడు. కానీ దర్శకుడు ఎవరేనేది డిసైడ్ అవ్వలేదు. ఇక మరో ఇద్దరి దర్శకుల పేర్లు కూడా బాగానే వినిపిస్తున్నాయి. కానీ ఈ టైమ్ లో త్రివిక్రమ్ ఒక మంచి కథను పవన్ తో చేస్తే అప్పుడు అసలైన మజా ఉంటుంది. మరి ఆ విధంగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా అయిపోగానే పవన్ తో చేస్తాడో లేదో చూడాలి.