మళ్లీ రీమేక్ చేస్తున్న పవన్!?

Tue Mar 21 2017 11:25:30 GMT+0530 (IST)

పవన్ కళ్యాణ్ సినిమాల సెలక్షన్ అందరికీ భలే షాక్ ఇస్తోంది. ఈ వారం రిలీజ్ అవుతున్న కాటమరాయుడు చిత్రం.. అజిత్ నటించిన వీరంకు రీమేక్ అనే సంగతి తెలిసిందే. తెలుగులో వీరుడొక్కడే పేరుతో ఈ చిత్రం రిలీజ్ అయినా సరే.. దాని రూపురేఖలు మార్చేసి మరీ రీమేక్ చేసేశాడు పవర్ స్టార్.ఇప్పుడు ఇలాంటిదే మరొకటి చేస్తున్నాడట పవన్ కళ్యాణ్. విజయ్ నటించిన తెరి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు పవన్ సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. కందిరీగ- హైపర్ వంటి చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.. ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడట. అయితే.. విజయ్ నటించిన తెరి.. ఇక్కడ పోలీస్ అనే పేరుతో గ్రాండ్ గానే రిలీజ్ అయింది. అయినా సరే.. ఈ సినిమాను రీమేక్ చేసేందుకు పవన్ నటించడం ఖాయం అని.. ఇప్పటికే అగ్రిమెంట్స్ కూడా పూర్తయిపోయాయని తెలుస్తోంది.

త్వరలో త్రివిక్రమ్ తో సినిమా ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్న పవన్.. అజిత్ నటించిన వేదాలం చిత్రాన్ని కూడా రీమేక్ చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు ఆర్టీ నేసన్ దీన్ని రూపొందించనున్నాడు. అంటే.. కాటమరాయుడుతో కలిపి పవన్ మొత్తం 4 ప్రాజెక్టులు చేస్తుండగా.. వీటిలో 3 తమిళ్ రీమేక్స్ అన్నమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/