Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్: పవన్ కొడుకు హైట్

By:  Tupaki Desk   |   25 July 2017 11:09 AM GMT
హాట్ టాపిక్: పవన్ కొడుకు హైట్
X
స్టార్ హీరోల పిల్లలు టీనేజీలోకి రాగానే వాళ్ల తెరంగేట్రం గురించి చర్చ మొదలైపోతుంది. వాళ్లు మీడియా దృష్టిలో పడ్డా.. అభిమానులకు కనిపించినా.. రకరకాల చర్చలు ఆరంభమవుతాయి. పవన్ కళ్యాణ్ పిల్లలు ఈ హడావుడి ఏమీ లేకుండా పుణెలో పెరుగుతున్నప్పటికీ ఎప్పుడైనా మన జనాల కళ్లల్లో పడ్డారంటే వార్తాంశాలు పుట్టుకొచ్చేస్తాయి. ఇప్పుడు పవన్ కొడుకు అకీరా నందన్ గురించి సోషల్ మీడియాలో ఇలాంటి చర్చే నడుస్తోంది. ఇంతకుముందు మీడియా దృష్టిలో పడ్డప్పటికీ.. ఇప్పటికీ తేడా ఉండటమే ఈ చర్చకు కారణం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా హైదరాబాద్ లో లేని సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హైదరాబాద్ ఎయిర్ పోర్టులో నడిచొస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. పవన్ వెనుకే ఓ పొడవాటి కుర్రాడు కనిపిస్తున్నాడు. పవన్ కన్నా ఒక అర అడుగు ఎత్తుతో కనిపిస్తున్నాడు ఆ కుర్రాడు. ఇంతకీ ఎవరీ కుర్రాడని జాగ్రత్తగా పరిశీలిస్తే.. అకీరా నందన్ అన్న విషయం తెలిసిందే. చిన్న పిల్లోడనుకుంటున్న అకీరా ఇంత ఎప్పుడు ఎదిగిపోయాడా అంటూ ఆశ్చర్యపోతున్నారు పవన్ ఫ్యాన్స్. అకీరా కూడా సినిమాల్లోకి రావడం గ్యారెంటీ అన్న అభిప్రాయంతో ఉన్న ఫ్యాన్స్.. మరో ప్రభాస్.. వరుణ్ తేజ్.. రానా లాంటి ఆజానుబాహుడైన హీరో దొరికేసినట్లే అంటూ కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో.