Begin typing your search above and press return to search.

ఆ గిఫ్ట్ ల కంటే పవన్ వాచ్ తక్కువేనమ్మా

By:  Tupaki Desk   |   4 May 2016 11:30 AM GMT
ఆ గిఫ్ట్ ల కంటే పవన్ వాచ్ తక్కువేనమ్మా
X
'వాడి చేతికున్న వాచ్ అమ్మితే.. మీ బ్యాచ్ కి లైఫ్ సెటిల్ అయిపోతుంది'.. ఇది అత్తారింటికి దారేది మూవీలో పవన్ కళ్యాణ్ గురించి కమెడియన్లకు సమంత చెప్పే డైలాగ్. మరీ ఈ రేంజ్ లో కాకపోయినా.. పవన్ ఓ ఖరీదైన వాచ్ నే పెట్టుకుని కనిపించాడు. అ..ఆ.. ఆడియో వేడుకకు పవన్ బ్రెట్లింగ్ బర్నాటో కంపెనీకి చెందిన ఓ కాస్ట్లీ వాచ్ లో రావడంతో.. బాగా లగ్జరీ జీవితం అనుభవించేస్తున్నాడని అంటున్నారు.

సినిమాకి 15-20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరో.. లగ్జరీ జీవితం గడపడం తప్పేం కాదు. కానీ.. తన దగ్గర డబ్బుల్లేవని, కష్టాల్లో ఉన్నానని గతంలో పవన్ గతంలో చెప్పాడు. అందుకే 4 లక్షల రూపాయల వాచ్ పెట్టుకునే వాడికి కష్టాలేంటో అని విమర్శలు మొదలైపోయాయి. చేతికి ఓ 4లక్షల వాచ్ తో కనిపించినంత మాత్రాన కష్టాలు లేవనే మాట కరెక్ట్ కాదని చెప్పాలి. ఇప్పటి ట్రెండ్ ను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.

శ్రీమంతుడు తర్వాత కొరటాలకు 50 లక్షల కార్ గిఫ్ట్ ఇచ్చాడు మహేష్ బాబు. జనతా గ్యారేజ్ స్టార్ట్ చేశాక.. ఇదే కొరటాలకు 20 లక్షల రూపాయల వాచ్ బహుమతిగా ఇచ్చాడు ఎన్టీఆర్. గిఫ్టుల కిందే ఇంతేసి ఖర్చుపెట్టే రోజుల్లో.. తన చేతికి తనే కొనుక్కున్న 4 లక్షల రూపాయల వాచ్ అంత కాస్ట్లీనా అనిపించకమానదు. మరి ఇప్పటికీ పవన్ లగ్జరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటుంటే.. వాళ్లను పిచ్చోళ్లకిందో, అమాయకుల కిందో జమ కట్టాలి.