Begin typing your search above and press return to search.

రెండు యూనిట్లు సెట్ చేసిన సర్దార్

By:  Tupaki Desk   |   8 Feb 2016 5:30 PM GMT
రెండు యూనిట్లు సెట్ చేసిన సర్దార్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ను కంప్లీట్ చేసేందుకు స్పీడ్ పెంచాడు. మొదట్లో షూటింగ్ నత్త నడకన సాగినా.. ఇప్పుడు మాత్రం ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడంతో.. ఆ డేట్ ని అందుకునేందుకు తెగ కష్టపడాల్సి వస్తోందని తెలుస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ ను ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.

ఇంకా కరెక్ట్ గా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. కానీ షూటింగ్ చేయాల్సిన భాగం చాలానే ఉందని తెలుస్తోంది. అందుకే త్వరగా పిక్చరైజ్ చేసేందుకు రెండు యూనిట్స్ ను సెటప్ చేసి.. త్వరత్వరగా కంప్లీట్ చేయాలని పవన్ ఆర్డర్ చేశాడట. ఇప్పటికే ఇలా రెండు యూనిట్లుగా విడిపోయి షూటింగ్ చేసేస్తున్నారు కూడా. పవన్ సహా ప్రధాన నటులపై వచ్చే సన్నివేశాలను డైరెక్టర్ బాబీ హయాంలో షూటింగ్ చేస్తుండగా.. మిగిలిన వాటిని నిర్మాత శరత్ మరార్ పర్యవేక్షణలో కో డైరెక్టర్స్ తో కానిచ్చేస్తున్నారని తెలుస్తోంది. మొదట్లో తాపీగా షూటింగ్ చేయడంతో.. చివరకు వచ్చేసరికి హడావిడి పడాల్సి వస్తోందనే టాక్ వినిపిస్తోంది.

ఇక్కడి నుంచి నాలుగు వారాల్లోగా షూటింగ్ భాగం పూర్తి చేసేసి, ఆ తర్వాత నాలుగు వారాల పాటు పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీలకు కేటాయించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. త్వరగా షూటింగ్ జరుగుతోందన్న మాట సంతోషం కలిగించినా.. మరి ఇలా హడివిడిగా కంప్లీట్ చేసే సన్నివేశాలు.. ఇద్దరితో కంప్లీట్ చేయించడం వంటివి.. సినిమా ఔట్ పుట్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతాయో అని అభిమానులు బెంగ పెట్టుకున్నారు.