Begin typing your search above and press return to search.

పవన్.. ఆ కమెడియన్ కి కాస్త చెప్పరాదూ

By:  Tupaki Desk   |   25 Nov 2015 1:30 PM GMT
పవన్.. ఆ కమెడియన్ కి కాస్త చెప్పరాదూ
X
అభిమానం వెర్రితలలు వేస్తే ఎలా ఉంటుందో తమిళ ఫ్యాన్స్ ని చూసే తెలుసుకోవాలి. తమకు నచ్చిన హీరో హీరోయిన్లకు ఆలయాలు కట్టించడం వారికే చెల్లింది. కటౌట్లకు పాలాభిషేకం చేయడం.. స్క్రీన్ ముందు హారతులు పట్టడం లాంటి ‘అతి’ అభిమానం కూడా వాళ్ల దగ్గర్నుంచే మన దగ్గరికి ట్రాన్స్ ఫర్ అయింది. ఐతే ఇప్పుడు తమ అభిమాన తారలకు గుళ్లు కట్టించే సంస్కృతి కూడా మన దగ్గరా పాకుతోంది.

ఎవరో అనామకుడు ఈ పని చేసినా సరే.. స్వయంగా ఓ కమెడియన్ ఈ పనికి పూనుకుంటున్నాడు. ఆ కమెడియన్ ఎవరో కాదు.. షకలక శంకర్. తన అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్ కోసం తన సొంత జిల్లా శ్రీకాకుళంలో గుడి కట్టించబోతున్నట్లు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు శంకర్. ఐతే ఫ్లోలో ఏదో అంటున్నాడులే అనుకుంటే.. నిజంగానే ఆ దిశగా సన్నాహాలు కూడా మొదలుపెట్టేశాడట. శ్రీకాకుళంలో ఓ ప్లేస్ చూసి అక్కడ గుడి పనులు మొదలుపెట్టేస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

అయినా మన మధ్య తిరిగే మనిషికి విగ్రహం పెట్టడమే అతి అంటే.. గుడి కట్టించడమేంటి మరీ టూమచ్ కదా. పవన్ కళ్యాణ్ అయినా ఇందుకు అంగీకరిస్తాడా? విశేషం ఏంటంటే పవన్ కొత్త సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో షకలక శంకర్ ఓ చిన్న పాత్ర చేస్తున్నాడు. పవన్ చెవిన ఎవరైనా ఈ గుడి సంగతి వేస్తే ఆయనైనా శంకర్ ను మందలిస్తాడేమో చూడాలి.