Begin typing your search above and press return to search.

సర్దార్ దెబ్బకి సూర్యకి చుక్కలు

By:  Tupaki Desk   |   27 April 2016 6:00 AM GMT
సర్దార్ దెబ్బకి సూర్యకి చుక్కలు
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్ట్స్ మూవీకి గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఎస్ జే సూర్యతో సినిమా ఫిక్స్ అయినా.. అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇవ్వలేదంతే. సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కి రెండు నెలల ముందు నుంచే స్క్రిప్ట్ వర్క్స్ తో పాటు.. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా చేసేశారు. ఇప్పుడీ ప్రాజెక్ట్ విషయంలో పవన్ మనసు మార్చుకున్నాడని అంటున్నారు.

పవన్ మనసు మార్చుకోవడం అంటే.. సినిమా చేయకపోవడం కాదు. పవన్ ఓసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే.. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరుకుంది. అయితే ఎస్ జే సూర్యతో సినిమా విషయంలో మాత్రం.. స్క్రిప్ట్ ఇంకా బెటర్ గా తీసుకురమ్మన్నాడని అంటున్నారు. సర్దార్ ఎఫెక్ట్ తర్వాత తను మళ్లీ సాధారణమైన మూవీతో వస్తే.. ఆడియన్స్, ముఖ్యంగా ఫ్యాన్స్ నిరుత్సాహపడతారని పవర్ స్టార్ భావిస్తున్నాడట.

పవన్ సూచనల మేరకు దర్శకుడు సూర్య - ఆకుల శివలు ఇప్పటికే స్క్రిప్ట్ పనులు స్టార్ట్ చేసేశారు. మరింత హీరోయిజం - కామెడీ ఉండేలా అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే.. స్టోరీ - స్క్రిప్ట్ లో సడెన్ గా మార్పులు చేయాల్సి రావడంతో.. ముందుగా అనుకున్నట్లుగా షూటింగ్ వెంటనే స్టార్ట్ కాకపోవచ్చని తెలుస్తోంది. ఇవాళ రేపట్లో అధికారికంగా ముహూర్తం షాట్ తీసినా.. షూటింగ్ మాత్రం జూన్ వరకూ డిలే అయ్యే ఛాన్సులు ఉన్నాయంటున్నారు.